BigTV English

India Vs England 3rd Test Live Updates: భారత్ 445 ఆలౌట్.. బెన్ డక్కెట్ మెరుపు సెంచరీ.. ఇంగ్లాండ్ 207/2..

India Vs England 3rd Test Live Updates: భారత్ 445 ఆలౌట్.. బెన్ డక్కెట్ మెరుపు సెంచరీ.. ఇంగ్లాండ్ 207/2..
India Vs England  Test

India Vs England 3rd Test (live sports news):


రాజ్ కోట్ టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 326 /5 రెండోరోజు ఆట కొనసాగించిన టీమిండియా ప్రారంభలోనే సెంచరీ హీరో జడేజా ( 112), వైట్ వాచ్ మన్ కులదీప్ యాదవ్ (4) వికెట్లు కోల్పోయింది. ఈ ఇద్దరూ జట్టు స్కోర్ 331 వద్దే అవుట్ అయ్యారు. తొలిరోజు 110 పరుగులతో క్రీజులో ఉన్న జడ్డూ మరో రెండు పరుగులు జోడించి పెవిలియన్ కు చేరాడు. ఒక పరుగుతో క్రీజులో ఉన్న కులదీప్ మరో 3 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 331 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజాను తన బౌలింగ్ లోనే క్యాచ్ పట్టి రూట్ అవుట్ చేశాడు. కులదీప్ ను అండర్సన్ అవుట్ చేశాడు.

ఈ దశలో రవిచంద్రన్ అశ్విన్, తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ధ్రువ్ జురెల్ పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. దీంతో లంచ్ సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది. లంచ్ సమయానికి ధ్రువ్ జురెల్ (31), అశ్విన్ (25) క్రీజులో ఉన్నారు. అప్పటికి 8వ వికెట్ కు 57 పరుగులు జోడించారు.


అయితే లంచ్ తర్వాత కాసేపటి అశ్విన్ (37) రెహాన్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 77 పరుగుల 8వ వికెట్ భాగ్యస్వామ్యానికి తెరపడింది. జట్టు స్కోర్ 408 పరుగుల వద్ద టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ధ్రువ్ జురెల్ (46) హాఫ్ సెంచరీకి నాలుగు పరుగులు దూరంలో అవుట్ అయ్యాడు. దీంతో భారత్ 415 పరుగుల 9వ వికెట్ కోల్పోయింది. ఈ వికెట్ కూడా రెహాన్ అహ్మద్ కే దక్కింది.

Read More: మహిళా క్రికెటర్లకు వేధింపులు.. హెడ్ కోచ్ పై హెచ్‌సీఏ వేటు..

పదో వికెట్ కు బుమ్రా (26), సిరాజ్ (3 నాటౌట్) 30 పరుగులు జోడించారు. చివరి వికెట్ గా బుమ్రా అవుట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 445 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ కు 4 వికెట్లు దక్కాయి. రెహాన్ అహ్మద్ కు రెండు.. అండర్సన్, జోరూట్, టామ్ హర్ట్ లీకి తలో వికెట్ తీశారు. భారత్ బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అయ్యాడు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను దూకుడుగానే మొదలుపెట్టింది. బాజ్ బాల్ వ్యూహాన్ని అమలు చేసింది. ముఖ్యంగా బెన్ డక్కెట్ చెలరేగిపోయాడు. ఫోర్ల వర్షం కురిపించాడు. తొలి వికెట్ కు జాక్ క్రాలీ (15) తో కలిసి కేవలం 13.1 ఓవర్లలోనే 89 పరుగులు జోడించాడు. జాక్ క్రాలీ అవుటైనా తర్వాత ఓలీ పోప్ తో కలిసి 93 పరుగలు జోడించాడు. పోప్ ను సిరాజ్ అవుట్ చేయడంతో ఇంగ్లాడ్ 182 పరుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.

సెంచరీతో విధ్వంసం సృష్టించిన డక్కట్ (133 బ్యాటింగ్, 118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సులు ) జోరూట్ (9 బ్యాటింగ్ ) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండోరోజు ఆటముగిసే సరికి ఇంగ్లాండ్ కేవలం 35 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసింది.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×