E-Paper
Advertisement

IND Vs ENG 2nd Test Live: బుమ్రా సిక్సర్.. ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇండియాకు భారీ లీడ్..

IND Vs ENG 2nd Test Live: బుమ్రా సిక్సర్.. ఇంగ్లాండ్ ఆలౌట్.. ఇండియాకు భారీ లీడ్..
Advertisement

India Vs England 2nd Test Live Updates : రెండో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసిన టీమిండియా ఇటు బౌలింగ్ లోనూ సత్తాచాటింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత్ బౌలర్లు నిలువరించారు. ముఖ్యంగా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చెలరేగాడు.

ఇంగ్లాండ్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. జో రూట్ (5) వికెట్ తో ఖాతాను ప్రారంభిన బుమ్రా ఆతర్వాత తొలిటెస్టులో అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని దూరం చేసిన ఓలీ పోప్ (23) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. జానీ బెయిర్ స్టో (25), బెన్ స్టోక్స్ (47) , టాప్ హర్టీలీ (21), అండర్సన్ (6) ను పెవిలియన్ కు పంపాడు. వికెట్ల సిక్సర్ తో ఇంగ్లాండ్ ను ఆలౌట్ చేశాడు.

Advertisement

మరోవైపు స్పిన్నర్ కులదీప్ యాదవ్ వలకు ఇంగ్లాండ్ బ్యాటర్లు చిక్కారు. బెన్ డెక్కెట్ (21), కీపర్ బెన్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6) ను కులదీప్ అవుట్ చేశాడు.

ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రాలేని అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 234 పరుగుల వద్ద 9 వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు అండర్సన్, షోయబ్ బషీర్ నిలబడ్డారు. చివరి వికెట్ గా అండర్సన్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ 253 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 143 పరుగుల భారీ లీడ్ లభించింది.

Advertisement

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ను భారత్ ప్రారంభించింది. 5 ఓవర్ల మాత్రమే సాగింది. రోహిత్ శర్మ (13 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. మొత్తం లీడ్ 171 పరుగులకు చేరింది.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×