BigTV English

IND Vs PAK Match Preview: అందరి చూపు అటు అమెరికా వైపే.. నేడే భారత్-పాకిస్తాన్ పోరు!

IND Vs PAK Match Preview: అందరి చూపు అటు అమెరికా వైపే.. నేడే భారత్-పాకిస్తాన్ పోరు!
T20 World Cup 2024 – India Vs Pakistan Match Preview: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్-ఇండియా మ్యాచ్ నేడు న్యూయార్క్ లో జరగనుంది. అప్పుడే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే వర్షం ఎఫెక్టు ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ సమయంలో రెండు జట్లు పోరాటానికి, ఒక సమరానికి సిద్ధమవుతున్నాయి.

క్రికెట్ ఆడే దేశాలన్నీ.. ఈ మ్యాచ్ ని రెప్పవేయకుండా చూస్తాయి. ఒకప్పుడు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య కూడా ఇదే తరహాలో ఉండేది. కాకపోతే వాళ్లు దశాబ్దాల తరబడి, ఆడటం.. ఒక దశలో ఇంగ్లండ్ ఘోర పరాజయాలతో వాళ్లకి ఆ యాషెస్ కప్ పై ఆసక్తి పోయింది.


అంటే నాటి తరానికి ఉన్న ఆసక్తి, కసి నేటి తరంలో పోయిందనే చెప్పాలి. కానీ పాకిస్తాన్-ఇండియా విషయానికి వస్తే అలా జరగలేదు. రోజురోజుకి అది ఎక్కువైపోతుందే తప్ప తగ్గలేదు. అంతేకాదు ప్రపంచకప్ మ్యాచ్ అనేసరికి ఆ జోష్ మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇప్పుడందరూ అత్యంత ఆసక్తితో రాత్రి ఎప్పుడవుతుందా? అని చూస్తున్నారు.

భారత్-పాకిస్తాన్ మధ్య గ్రూప్ ఏ లో మ్యాచ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎప్పటిలాగే పిచ్ బౌలర్లకు అనుకూలించేలా ఉంది. మ్యాచ్ లో భారీ స్కోర్లు చూడలేం. భారీగా వికెట్లు పతనం కావడాన్ని చూడవచ్చు. అయితే పాకిస్తాన్ లో వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లు ఉన్నారు. వారి వేగానికి ఇన్ స్వింగ్, అవుట్  స్వింగ్ తోడైతే ఇండియా బ్యాటర్లు నిలవగలరా? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే టీమ్ ఇండియాలో చివరి 8వరకు ఆల్ రౌండర్లతో కూడిన బ్యాటర్లు ఉన్నారు.


Also Read: ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆసీస్, 36 పరుగుల తేడాతో..

అయితే ఇక్కడ నెగ్గితే సులువుగా టీమ్ ఇండియా సూపర్ 8 కి వెళ్లే అవకాశాలుంటాయి. ఎందుకంటే తర్వాత మ్యాచ్ లు కెనడా, యూఎస్ఏతో జరుగుతాయి. అవి చిన్నజట్లే కాబట్టి పర్వాలేదు. కానీ యూఎస్ ఏ తో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే పాక్ లాంటి జట్టుని మట్టికరిపించింది. వారికి అలవాటైన పిచ్ ల మీద రెచ్చిపోతున్నారు. అందుకని పాకిస్తాన్ పై నెగ్గడం తప్పనిసరిగా మారింది. అక్కడ ఓడినా ఈ విజయం పనికి వస్తుంది.

ఇదే ఈక్వేషన్ పాకిస్తాన్ కి వరిస్తుంది. టీమ్ ఇండియాపై గెలిచి, మిగిలిన ఐర్లాండ్, కెనడాలపై గెలిస్తే, వారికి సూపర్ 8 గేట్లు తెరుచుకుంటాయి. నిజానికి ఈ గెలుపు పాకిస్తాన్ కి అత్యంత అవసరం కాబట్టి, ఎంతకైనా తెగించి ఆడే అవకాశాలున్నాయి.

Also Read: Pakistan Captain Babar Azam : ఒక ప్రణాళిక లేకుండా వచ్చాం : పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

అందుకని టీమ్ ఇండియాలో సీనియర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బూమ్రా తదితరులు నిలిస్తే మ్యాచ్ జారిపోకుండా ఉంటుందని అంటున్నారు. వర్షం వల్ల మ్యాచ్ కి ఆటంకం కలగకపోతే మాత్రం.. ఈ రోజు రాత్రి.. ఆటలో నిజమైన మజాని అనుభవించే అవకాశం ఉంది.

Related News

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Big Stories

×