BigTV English

Galla Jayadev Re-entry: గల్లా వాట్ నెక్స్ట్..? రీ ఎంట్రీ ఎప్పుడు..?

Galla Jayadev Re-entry: గల్లా వాట్ నెక్స్ట్..? రీ ఎంట్రీ ఎప్పుడు..?

అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పరాకాష్ట గల్లా ఫ్యామిలీ రాజకీయ భవితవ్వం. దాదాపు 70 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ పోటీపడే ఆ కుటుంబం తొలిసారిగా పోటీ నుంచి తప్పుకుంది. వేల కోట్ల ఆస్తులు.. వేల మంది ఉద్యోగులు.. లక్షల మంది అభిమానులు అండదండలు ఉన్నా.. వ్యాపారం కోసం తమపై ఆధారపడిన ఉద్యోగుల కుటుంబాల కోసం గల్లా కుటుంబం రాజకీయాలను తప్పుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా జరుగుతూనే ఉంది.

రాజకీయాలకు ఇక సెలవు అంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రకటన.. టీడీపీ కార్యకర్తలను గల్లా అభిమానులను నివ్వెరపరిచింది. 1955 నుంచి రాజకీయాల్లో ఉన్న జయదేవ్‌ కుటుంబం తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల సమరం నుంచి తప్పుకోవడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ డిబేట్‌గా మారింది. 2019 ఎన్నికల నుంచే జయదేవ్ తల్లి మాజీమంత్రి గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు జయదేవ్‌ కూడా తప్పుకోవడంతో 70 ఏళ్లలో తొలిసారిగా గల్లా కుటుంబం ఎన్నికల రణక్షేత్రం నుంచి నిష్క్రమించినట్లైంది.


Also Read: పుష్ప కి శిల్ప స్ట్రోక్.. ఫైర్ అవుతున్న బెట్టింగ్‌బాబులు

జయదేవ్‌ తాత గల్లా అరుణ తండ్రి పాటూరి రాజగోపాల్‌నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. 1955లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పాటూరు రాజగోపాల్‌నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె నియోజకవర్గం నుంచి 1955లో కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థిగా, 1962లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. పాటూరు రాజగోపాల్ నాయుడు. 1972లో శాసన మండలి సభ్యుడుగా పనిచేశారు. తర్వాత చిత్తూరు ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు.

జిల్లాలో అనేక సామాజిక కార్యక్రమాలతో జనం లో నిలిచిన రాజగోపాల్ నాయుడుని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన రాజకీయ గురువుగా చెప్పుకుంటారు.ఆయన తర్వాత రాజగోపాల్‌నాయుడు కుమార్తె గల్లా అరుణ కుమారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి. రాజగోపాలనాయుడు వారసురాలిగా వచ్చిన గల్లా అరుణకుమారి 80వ దశకం నుంచి దాదాపు నలభయ్యేళ్లు రాజకీయాల్లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించలేదు.

Also Read: Kodali Nani Comments : పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు కొడాలి నాని విమర్శలు.. ఈ మార్పు దేనికి సంకేతం ?

ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌ 2014లో రాజకీయాల్లో అడుగుపెట్టి వరుసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచి ప్రత్యేకత చాటుకున్నారు. అరుణకుమారి కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. అమరరాజా ఫ్యాక్టరీస్‌తో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన గల్లా కుటుంబంపై ఈ ప్రాంతంలో ఎంతో గౌరవం ఉంది. అందుకే ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఎక్కువ విజయాలే కనిపిస్తాయి.

రెండుసార్లు ఎంపిగా గెలిచిన జయదేవ్.. చాలాకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎంపీగా గెలిచిన తొలిసారే మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అంటూ తన వాగ్దాటిని ప్రదర్శించిన జయదేవ్‌ నేషనల్ వైడ్‌గా ఫోకస్ అయ్యారు. అలాంటాయన అనూహ్యంగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ తీసుకున్న నిర్ణయం టీడీపీ వర్గాలను నివ్వెరపరిచింది. ఆయన ఆకస్మికంగా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పడానికి గల కారణాలపై విస్తృత చర్చ జరిగింది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గల్లా కుటుంబానికి చెందిన అమర రాజా సంస్థ అనేక ఇబ్బందులు పడుతుంది.

Also Read: Balineni Srinivasa Reddy : బాలినేని జంప్ ? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం ?

గల్లా జయదేవ్‌ నిర్ణయం ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల్లా నిర్ణయంపై మరింత ఎక్కువ చర్చ జరుగుతోంది. జయదేవ్ ఈ సారి బరిలో ఉండి ఉంటే గుంటూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించి కేంద్రంలో కేబినెట్ బెర్త్ దక్కించుకునే వారనడంలో ఎలాంటి సందేహం.. మొత్తమ్మీద జగన్ కక్షపూరిత రాజకీయాల పుణ్యమా అని ఏపీ ఒక మంచి లీడర్‌ని కోల్పోయింది. మరి జగదేవ్ పొలిటికల్ రిటైర్మెంట్ పర్మనెంటో? టెంపరరీనో చూడాలి.

Tags

Related News

Telangana Politics: మరోసారి హాట్ టాపిక్‌గా మారిన కొండా ఫ్యామిలీ

Gaza conflict: హమాస్ VS ఇజ్రాయెల్.. గాజాలో శాంతి నెలకొంటుందా?

AI assistant: AI యుగం వచ్చినా.. అమ్మాయిలపై వేధింపులు ఆగవా..

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Big Stories

×