BigTV English

IND Vs PAK: 2017 ప్రతికారం తీర్చుకోనున్న టీమిండియా ?

IND Vs PAK: 2017 ప్రతికారం తీర్చుకోనున్న టీమిండియా ?

IND Vs PAK: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 లో టీమిండియా విజయంతో బోనీ కొట్టగా.. పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ కి.. తొలి మ్యాచ్ లోనే కివీస్ చేతిలో పరాభవం ఎదురైంది. అలాగే ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం మరో ఎదురు దెబ్బ. ఇలాంటి పరిస్థితులలో టీమ్ ఇండియాను ఢీకొట్టేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది. మరికొద్ది గంటలలోనే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.


 

దాయాధుల పోరు అంటే సర్వత్ర ఆసక్తి ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పటివరకు చాలా మ్యాచ్ లలో ఇరుజట్లు తలపడగా.. ఒకసారి గత మ్యాచ్ ల రికార్డులను పరిశీలిస్తే.. ఐసీసీ టోర్నీలలో ఇప్పటివరకు భారత్ – పాకిస్తాన్ 21సార్లు పోటీ పడ్డాయి. ఇందులో భారత్ 16 సార్లు విజయం సాధించింది. పాకిస్తాన్ కేవలం 5 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేవలం ఈ గణాంకాలు మనం రిలాక్స్ కావడానికి చాలవంటున్నారు క్రీడా నిపుణులు. టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.


ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల గణాంకాలు చూస్తే.. భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 135 వన్డేలు జరిగాయి. వీటిలో పాకిస్తాన్ 73 మ్యాచ్ లలో విజయం సాధించింది. వన్డేలలో పాకిస్తాన్ ఆధిపత్యం చెలాయించగా.. ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం పాకిస్తాన్ పై భారతదే పై చేయిగా ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గణాంకాలను చూస్తే కాస్త ఆందోళన కలుగుతుంది. ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ – పాకిస్తాన్ ఐదుసార్లు తలపడగా.. పాకిస్తాన్ మూడుసార్లు విజయం సాధించింది.

2004, 2009 లో పాకిస్తాన్ జట్టు గెలుపొందగా.. 2013 లో భారత్ విజయం సాధించింది. ఇక 2017 సీజన్ లో దాయాది జట్లు రెండుసార్లు ఢీకొన్నాయి. లీగ్ స్టేజ్ లో భారత్ గెలవగా.. ఫైనల్ లో పాకిస్తాన్, భారత్ ని ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఈసారి భారత బ్యాటింగ్ కూడా బలంగానే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరకు అందరూ బ్యాటర్లే. వీరిలో కొందరు బౌలర్లు అయినా.. ఆల్ రౌండర్లుగా పేరుంది.

 

జట్టు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా వీరికి ఉంది. ఇక బౌలింగ్ విషయంలో షమీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరోవైపు హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ లలో ఎవరైనా వికెట్ కరెక్ట్ టైమ్ లో తీయగలరు. ఇక స్పిన్నర్ ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని దింపబోతున్నట్లు సమాచారం. అదే జరిగితే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వారి స్పిన్ మాయాజాలంతో పాకిస్తాన్ బ్యాటర్లను కట్టడి చేయడం ఖాయం. ఇలా ఎటు చూసినా ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఖాయమన్న లెక్కలు కనపడుతున్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×