BigTV English

Local Boy Nani : సారీ చెప్పినా… వదల్లేదు… బెట్టింగ్ మాఫియా పోలీసుల ఉక్కుపాదం

Local Boy Nani : సారీ చెప్పినా… వదల్లేదు… బెట్టింగ్ మాఫియా పోలీసుల ఉక్కుపాదం

Youtuber:తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు.. మరో యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ ట్విట్టర్లో యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో విశాఖ పోలీసులు లోకల్ బాయ్ నాని పై కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


అసలేం జరిగిందంటే..?

అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ బాయ్ నాని పై టీజీఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ లోకల్ బాయ్ నాని పై విరుచుకుపడుతూ కామెంట్లు చేశారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు అవసరమా అంటూ లోకల్ బాయ్ నానిని ఉద్దేశించి మరి సజ్జనార్ క్వశ్చన్ చేశారు.. ముఖ్యంగా మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాలలో ఉపయోగించుకొని, డబ్బు సంపాదించండి .ఇలాంటి పనుల వల్ల ఎంతో మందిని బెట్టింగ్ భూతానికి బానిసలను చేసి వారి జీవితాలు నాశనం చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి అంటూ సజ్జనార్ తెలిపారు. అంతేకాదు సమాజ శ్రేయస్సు కోసం ఈ ప్రమోషన్లను ఆపండి అంటూ కూడా లోకల్ బాయ్ నాని కి సూచించారు.


Unni Mukundan : అభిమానిపై అంత కోపమా హీరో గారూ… బాలయ్యను చూసి నేర్చుకున్నారా?

దీంతో దిగివచ్చిన లోకల్ బాయ్ నాని..

సజ్జనార్ మాటలకు.. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, ఫిషర్ మాన్, లోకల్ బాయ్ నాని దిగొచ్చాడు. సజ్జనార్ కు సారీ చెప్పాడు.. సారీ సార్.. తప్పయింది. ఇంకెప్పుడు ఇలాంటివి చేయను అంటూ దండం పెట్టి మరీ తన తప్పును ఒప్పుకున్నాడు లోకల్ బాయ్ నాని. ఈ మేరకు ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు.” మూడు రోజుల క్రితం సర్జనార్ సార్ నా బెట్టింగ్ వీడియో మీద స్పందించడంతో నాకు ఒక్కసారిగా భయం వేసింది. అయితే నేను బెట్టింగ్ ఆడిన వీడియో అది పాతది. ఎప్పుడో నేను బెట్టింగ్ ఆపేశాను. వీడియో పాతదైనా.. కొత్తదైనా.. నేను చేసింది తప్పే. కాబట్టి ఆ తప్పును నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. వాస్తవానికి నేను చదువుకోలేదు. కానీ చాలామంది చదువుకున్నవారే ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసారు. వాళ్ళను చూసి ఇదంతా నిజమే అనుకొని నేను కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాను. ఆ తర్వాత ఇది ఫేక్ అని వాటి వల్ల చాలామంది జీవితాలు నాశనమవుతున్నాయని, ఆపేయమని కొందరు చెప్పడంతో వెంటనే ఆపేశాను. అప్పటినుంచి వాటి జోలికి వెళ్లలేదు. చదువుకున్న వారు ఇలాంటివి చేయడం వల్లే చదువుకోని నాలాంటి వాళ్ళు అది నిజమే అనుకొని చేస్తున్నారు. దయచేసి నాతో పాటు ప్రతి ఒక్కరూ మారాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×