E-Paper
Advertisement

Ind vs SL 2nd T20I Match Highlights: రెండో టీ 20లో టీమ్ ఇండియా గెలుపు.. సిరీస్ మనదే

Ind vs SL 2nd T20I Match Highlights: రెండో టీ 20లో టీమ్ ఇండియా గెలుపు.. సిరీస్ మనదే
Advertisement

India vs Sri Lanka 2nd T20I Match Highlights (sports news today): శ్రీలంకతో జరుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండో టీ 20లో భారత్ జయకేతనం ఎగురవేసింది. దీంతో  2-0తో ఆధిక్యంలో సిరీస్ ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం వర్షం వల్ల మ్యాచ్ కి 45 నిమిషాలు అంతరాయం కలిగింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ని 8 ఓవర్లకు కుదించారు. ఇండియా టార్గెట్ 78 పరుగులుగా ఇచ్చారు. దీంతో లక్ష్యాన్ని టీమ్ ఇండియా 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరీస్ ను కైవశం చేసుకుంది.

Advertisement

వివరాల్లోకి వెళితే.. 78 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గిల్ ప్లేస్ లో ఓపెనర్ గా వచ్చిన సంజూ శాంసన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాత్రం ధనాధన్ ఆడాడు. 15 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఫస్ట్ డౌన్ వచ్చిన సూర్యకుమార్ అయితే 12 బాల్స్ లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 22 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ని గెలిపించాడు. మరోవైపు రిషబ్ పంత్ (2) నాటౌట్ గా నిలిచాడు. ఎలాగైతేనేం.. 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి టీమ్ ఇండియా విజయదుందుభి మోగించింది.

Advertisement

శ్రీలంక బౌలింగులో తీక్షణ 1, హసరంగ 1, పతిరణ 1 వికెట్ పడగొట్టారు.

Also Read: ‘ఆ విజయం కోసం ఆమె ఎంతో కష్టపడింది’.. మనూ భాకెర్ విజయంపై స్పందించిన రాహుల్ ద్రవిడ్..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్లు ఫర్వాలేదనిపించారు. నిశ్సాంక (32), కుశాల్ మెండిస్ (10) చేసి అవుట్ అయ్యారు. ఫస్ట్ డౌన్ వచ్చిన కుశాల్ పెరీరా 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కమిందు మెండిస్ (26), కెప్టెన్ చరిత్ (14) పరుగులు చేశారు.

17 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దశున్ శనక, హసరంగ ఇద్దరూ గోల్డెన్ డక్ అవుట్లు అయ్యారు. ఆ తర్వాత రమేష్ మెండిస్ (12) చేసి అవుట్ అయ్యాడు. ఇలా అందరూ క్యూ కట్టడంతో శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

టీమ్ ఇండియా బౌలింగులో అర్షదీప్ 2, అక్షర్ పటేల్ 2, రవి బిష్ణోయ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. మొదటి టీ 20లో అద్భుతంగా బౌలింగు చేసి 3 వికెట్లు తీసిన రియాన్ పరాగ్… ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ రాలేదు. దీంతో తొలి మ్యాచ్ లో జరిగిన మ్యాజిక్ ఇప్పుడు పనిచేయలేదు. అలాగే సిరాజ్ కి కూడా వికెట్లు రాలేదు.

మూడో టీ 20 మ్యాచ్.. నేడు సోమవారం సాయంత్రం ఇదే పల్లెకెలె మైదానంలో జరగనుంది.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×