India vs Sri Lanka Dream11 Team Prediction 3rd ODI 2024: శ్రీలంక సిరీస్ కి సీనియర్లందరూ మళ్లీ జట్టులోకి వచ్చారని ఆనందపడిన భారత అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఒక్క రోహిత్ శర్మ తప్ప ఎవరూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తనే రెండు వన్డేల్లో ధనాధన్ ఆడి హాఫ్ సెంచరీలు చేశాడు. అయినా సరే, మిడిలార్డర్ వైఫల్యంతో టీమ్ ఇండియా గెలవాల్సిన మొదటి మ్యాచ్ ని టైగా ముగించింది. రెండో వన్డేలో ఓటమి పాలైంది.
శ్రీలంకపై విరాట్ కొహ్లీకి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు శ్రీలంకపై 53 వన్డేలు ఆడి.. ఏకంగా 61.2 సగటుతో 2,632 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. కానీ ఎందుకో సిరీస్ లో తేలిపోతున్నాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో 24, 14 పరుగులు మాత్రమే చేశాడు.
రేపు బుధవారం శ్రీలంకతో కొలంబో ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మూడో వన్డేకు రెండు మార్పులు చేసే యోచనలో టీమ్ ఇండియా ఉంది. ముఖ్యంగా శివమ్ దూబె, కేఎల్ రాహుల్ ను తప్పించనున్నారని అంటున్నారు. వారి ప్లేస్ లో రియాన్ పరాగ్, రిషబ్ పంత్ వస్తారని చెబుతున్నారు.