BigTV English

Mega Brother Nagababu:సినిమా ఇండస్ట్రీపై నాగబాబు సంచలన కామెంట్స్..వాళ్ల గురించేనా?

Mega Brother Nagababu:సినిమా ఇండస్ట్రీపై నాగబాబు సంచలన కామెంట్స్..వాళ్ల గురించేనా?

Mega Brother Nagababu coments on Cinema Industry Heroes..viral: మెగా ఫ్యామిలీలో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో ప్రవేశించారు నాగబాబు. రాక్షసుడు చిత్రం తో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన నాగబాబు ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. ఆయన హీరోగా నటించిన సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆదరించలేదు. అయితే నిర్మాతగా అంజనా ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకునేవాడు. అవడానికి చిరంజీవి కన్నా చిన్నవాడైనా..క్యారెక్టర్ నటుడిగా చాలా సినిమాలలో నటించారు. జబర్ధస్త్ లాంటి కామెడీ షోలకు జడ్జిగానూ వ్యవహరించారు.


జనసేన ప్రచారకర్తగా

కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక కూడా సినిమా రంగంలో బిజీగా మారిపోవడంతో రాజకీయ రంగం వైపు దృష్టి సారించారు. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఎలాంటి పదవులూ ఆశించని వ్యక్తిత్వంతో సాగిపోతున్నారు. ఆయన మామూలుగా ఎవరి జోలికీ వెళ్లరు..కానీ తమ ఫ్యామిలీ గురించి ఎవరైనా అవాకులు, చవాకులు పేలితే మాత్రం వాళ్లను ఆరేసుకుంటారు.అయితే ఇటీవల తన కుమార్తె నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తూ కమిటీ కుర్రాళ్లు మూవీ తీసింది. ఈ వారంలోనే మూవీ రిలీజ్ కానుంది. సినిమాకు తనవంతుగా ప్రమోషన్ చేస్తున్నారు నాగబాబు.


కమిట్ మెంట్ ఉన్న కమిటీ కుర్రాళ్లు

కమిటీ కుర్రాళ్లు మూవీని ఎంతో కమిట్ మెంట్ తో నిహారిక తీశారని..అంతే కమిట్ మెంట్ తో యాక్టర్లు నటించారని తప్పకుండా ఈ మూవీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. అందరూ కొత్తవాళ్లే అయినా చాలా బాగా చేశారని..ఈ మూవీ తర్వాత ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చెప్పలేనని అన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉంటేనే వారికి అవకాశాలు లభిస్తాయని అనుకోవడం పొరపాటని అన్నారు. చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయనకంటూ ఎవరూ గాడ్ ఫాదర్ లేరని..తనేమిటో నిరూపించుకుని ఇవాళ ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో ఉన్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సినీమా రంగం అందరికీ చెందినదని అన్నారు. అది ఏ ఒకరి అయ్య జాగీరో లేక తాత దో కాదు. మేమంతా అలా వచ్చినవాళ్లమే అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీ మీద పడి ఏడుస్తున్నారని ..అలా మాట్లాడే వెధవలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మా వరకూ అటువంటి ఫీలింగ్ లేదు అన్నారు. ఇదేదో నందమూరి,అక్కినేని ఫ్యామిలీలకూ చెందినది కాదుని వ్యంగ్యంగా అన్నారు.

కష్టపడేవారికే అవకాశాలు

ఇక్కడ కష్టపడి వచ్చినవారికే అవకాశాలు వస్తాయని అన్నారు. అలా పైకొచ్చినవారు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో అన్నారు. అడవి శేష్ తన సొంత టాలెంట్ తో ఎవరి సాయం లేకుండా హీరోగా అవ్వలేదా అన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నారు. కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం లేదు నిర్మాతలు. ఇక్కడే పుట్టి ఇక్కడే నటిస్తే వారికి కూడా సేఫ్టీగా ఉంటుందని అన్నారు. ఎవరైనా ఆడవారి జోలికొస్తే చూస్తూ ఊరుకోనని అన్నారు. వారిని మడత పెట్టి కొడతా నని నవ్వుతూ అన్నారు.అయితే నాగబాబు ఇండస్ట్రీ హీరోల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు పరోక్షంగా కొందరు హీరోల గురించే అని చర్చించుకుంటున్నారు. కొందరైతే సినిమా ప్రమోషన్స్ కు వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడాలి గానీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేనికి అని అంటున్నారు. ఇదేమీ రాజకీయ వేదిక కాదు..సమయం సందర్భం చూసుకోకుండా ఎదుటివారిపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలి అని మరికొందరు నాగబాబును ట్రోల్ చేస్తున్నారు.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×