Massive Accident in ORR: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బీభత్సంతో ప్రమాదం జరిగిన తర్వాత ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయాడు. అయితే, కారును అలాగే తీసుకెళ్లడంతో మృతుడి తల తెగిపడి కారులోని వెనకాల సీటులో పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు శంషాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో కారు ఢీకొట్టింది. కారు మితిమీరిన వేగంతో వచ్చి అతడిని ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి ఎగిరి పడి తల కారు ముందు భాగంలో అద్దంలో ఇరుక్కపోయింది. అయితే కారు వేగంతో కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో తల తెగి కారు వెనక సీట్లో పడిపోయింది. వెంటనే కారు డ్రైవర్.. కారును నిలిపివేసి పోలీసులకు సమచారం అందించాడు.
Also Read: జగిత్యాలలో యువకుడి హత్య కలకలం..నోట్లో మట్టి కుక్కి..!
మృతుడు శంషాబాద్ పరిధిలోని ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.