BigTV English

VeeraSimhaReddy : వీరసింహారెడ్డికి ఏపీ సర్కార్ షాక్.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక మార్పు..

VeeraSimhaReddy : వీరసింహారెడ్డికి ఏపీ సర్కార్ షాక్.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదిక మార్పు..

VeeraSimhaReddy : రాష్ట్రంలో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలకేకాదు.. సినిమా వేడుకలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. తాజాగా తీసుకొచ్చిన జీవోతో రోడ్లపై ర్యాలీలు, సభలకు అనుమతిలేదు. అలాగే రహదారులకు సమీపంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు. వేడుకలకు ఎంత మంది వస్తారు? సభా ప్రాంగణం కెపాసిటీ ఎంత? ఈ సమాచారం పోలీసులకు ఇచ్చి అనుమతి తీసుకోవాలి. ఇలాంటి నిబంధనలు ప్రభుత్వం తీసుకురావడంతో చంద్రబాబు కుప్పం టూర్ రచ్చరచ్చ అయ్యింది. ఇప్పుడు సినిమా ఫంక్షన్లపై ఈ ఎఫెక్ట్ పడింది.


నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఒంగోలులో నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఏబీఎం కాలేజీ మైదానంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ కు పోలీసు అధికారులు షాక్ ఇచ్చారు. ఏబీఎం మైదానంలో వేడుకలు నిర్వహించుకునేందుకు అనుమతి నిరాకరించారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలిస్తారని పోలీసుల అంచనా. అంత మంది వస్తే ఒంగోలులో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక వేదిక మార్చుకోవాలని చిత్ర బృందానికి సూచించారు. దీంతో వీరసింహారెడ్డి టీమ్‌ బీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాంగణాన్ని సందర్శించింది. మరి వేడుకను అక్కడే నిర్వహిస్తారా? చూడాలి.

క్రాక్‌ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక నటించింది. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగబోతోంది. విడుదల సందర్భంగానూ ఎలాంటి ఘటనలు జరుగుతాయని అనుమానాలు నెలకొన్నాయి. సినిమా విడుదల రోజు నందమూరి ఫ్యాన్స్ హంగామాను పోలీసులు ఆపగలుగుతారా? అభిమానులు రోడ్లపైకి వస్తే చూస్తూ ఊరుకుంటారా ? లాఠీలకు పనిచెబుతారా? మొత్తంమీద సినిమా విడుదల రోజు రచ్చ రేగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఏపీలో ఏ కార్యక్రమాలు నిర్వహించినా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రాబోతున్నారు. ఈ సినిమా వేడుకలపై ఏపీ ప్రభుత్వం అవే నిబంధనలు వర్తింపజేస్తుందా? లేక మెగాస్టార్ తో ఎలాగూ మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి చూస్తూ ఊరుకుంటుందా? చూడాలి మరి.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×