Danish Kaneria On Shahid Afridi: పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియాపై ( Danish Kaneria) మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akthar ) కీలక వ్యాఖ్యలు చేశాడు. డానిష్ కనేరియా పాకిస్తాన్ ప్లేయర్లు చాలా హీనంగా చూసే వాళ్ళని బాంబు పేల్చాడు. అతడు ఒక హిందువు కావడంతో పాకిస్తాన్ జట్టులో ఉన్న సభ్యులందరూ అనుచితంగా ప్రవర్తించే వారిని మండిపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్ లో అతన్ని దూరంగా పెట్టేవారని ఆరోపించాడు. భోజనం చేసేటప్పుడు కూడా దగ్గరకు రానిచ్చే వారిని కాదని అతడు పాకిస్తాన్ జట్టులో ఉన్నన్ని రోజులు నరకం అనుభవించాడని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.
పాకిస్తాన్ ప్లేయర్లపై షోయబ్ అక్తర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్వయంగా మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ జట్టులో తాను నరకం అనుభవించింది 100% నిజమైన అని.. అక్తర్ చెప్పిన విషయాలన్ని వాస్తవాలేనని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తనను ఇబ్బంది పెట్టింది మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అంటూ ఆరోపించాడు. వాడొక్కడే తనను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడని మండిపడ్డాడు. ఇస్లాం మతంలోకి మారాలని చాలా సార్లు తనను టార్చర్ పెట్టాడని గుర్తు చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో పాకిస్తాన్ జట్టులో ఉన్న మిగతా ప్లేయర్లతో కలిసి తనను ఇబ్బంది పెట్టాడని మండిపడ్డాడు. భోజనం చేసేటప్పుడు తనతో మిగతా ప్లేయర్లు ఎవరూ మాట్లాడనివ్వకుండా ఒంటరి చేశాడని ఫైర్ అయ్యాడు.
డ్రెస్సింగ్ రూమ్ లో కూడా తనను ఇబ్బంది పెట్టినట్టు గుర్తు చేశాడు. అలాంటి సమయంలో తనకు షోయబ్ అక్తర్ యూనిస్ ఖాన్, ఇంజమామ్ ఉల్ హక్, మహమ్మద్ యూసఫ్ లాంటి సీనియర్ క్రికెటర్లు మాత్రం అండగా నిలిచారని వివరించాడు. తన పట్ల దయ చూపించడమే కాకుండా మర్యాద కూడా ఇచ్చేవారని వెల్లడించాడు. తాను హిందువు అయినప్పటికీ పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తున్నానని.. జట్టు కోసం వందకు రెండు వందల శాతం కష్టపడ్డారని తెలిపారు.
తన పూర్వీకులు ఇండియాకు సంబంధించిన వారు తప్ప… తనకు ఇండియాతో ఎలాంటి సంబంధాలు లేవని కుండబద్దలు కొట్టి చెప్పాడు. హిందూ మతం చాలా గొప్పదని.. దాంతో పాటు ముస్లిం క్రికెటర్లను కూడా తాను గౌరవిస్తానని వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ముస్లింలకు మంచి ఆదరణ ఉంటుందని.. వాళ్లకి ఎక్కువగా అవకాశాలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిందని వెల్లడించాడు. తాను హిందువు కాబట్టి అవకాశాలు కూడా సరిగ్గా రాలేదని బాంబు పేల్చాడు. దీంతో డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.