Mamta Kulkarni: చాలావరకు హీరోహీరోయిన్లు కాస్త ఫేమ్ సంపాదించుకున్న తర్వాత సినీ పరిశ్రమలోనే ఉంటూ ఇక్కడే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిపోతుంటారు. కానీ చాలా తక్కువమంది నటీనటులు మాత్రమే క్రేజ్, ఫేమ్ అన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా సినీ పరిశ్రమను వదిలేసి వెళ్లిపోయి వారి పర్సనల్ లైఫ్‌పై దృష్టిపెడతారు. తాజాగా మాజీ నటి మమతా కులకర్ణి కూడా అదే చేశారు. కానీ ఆమె ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళలో మమతా సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్న మూడు రోజుల తర్వాత అలా ఎందుకు చేశారో ఆమె బయటపెట్టారు.
స్వేచ్ఛ కావాలి
‘‘నేను మళ్లీ సినిమాలు చేస్తానని ఊహించుకోలేకపోతున్నాను. అది దాదాపు అసాధ్యం. కిన్నర అఖండలో ఉండేవారు శివ, పార్వతుల అర్థనారీశ్వరకు చిహ్నంగా ఉంటారు. 23 ఏళ్లు ఆధ్యాత్మికతను ప్రాక్టీస్ చేసిన తర్వాత అఖండ గుంపుకు మహామండలేశ్వర్ అవ్వడం నాకు ఒలింపిక్ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోంది. ఆ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతోనే నాకు ఈ స్థానం దక్కింది. నేను కిన్నర అఖండనే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది స్వేచ్ఛను సూచిస్తుంది. ఇందులో ఎలాంటి పరిమితులు ఉండవు. మనిషి జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి. అందులో ఎంటర్‌టైన్మెంట్ కూడా ఒకటి. ఎవరి అవసరాలను వారు తెలుసుకోవాలి’’ అంటూ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు మమతా కులకర్ణి.
బుద్ధుడి దారిలోనే
‘‘ఆధ్యాత్మిక అనేది కేవలం అదృష్టంతోనే సాధ్యమవుతుంది. బుద్ధుడు కూడా జీవితంలో అన్నీ చూసేసిన తర్వాతే మార్పు కావాలని అనుకున్నాడు. నా సన్యాసం అనేది మహాదేవుడు, మహాకాళి నుండి వచ్చిన ఆర్డర్. నా గురువు ఇచ్చిన ఆర్డర్. వాళ్లే నాకోసం ఈరోజును ఎంచుకున్నారు. ఇందులో నా ప్రేమయం ఏమీ లేదు’’ అని చెప్పుకొచ్చారు మమతా కులకర్ణి. కొన్నిరోజుల క్రితం ఆచార్య మహామండలేశ్వర్ అయిన డాక్టర్ లక్ష్మి నారాయణ్ త్రిపాఠిని కలిసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు మమతా. ఒకానొక సందర్భంలో ఆమెను కిన్నర అఖండకు మహామండలేశ్వర్‌గా ప్రకటించి తన పేరును శ్రీ యమై మమతా నంద్ గిరిగా మార్చారు.
Also Read: పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించిన బాలకృష్ణ.. ఏమన్నారంటే?
అన్నీ వదిలేసి
మహా కుంభమేళ (Maha Kumbhmela) కోసం 25 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు మమతా కులకర్ణి (Mamta Kulkarni). సన్యాసిగా మారడం కోసం తన పిండ ప్రధానం తానే నిర్వహించారు మమతా. ఆ తర్వాత మహామండలేశ్వర్‌గా మారారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించిన మమతా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటి అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పదేపదే చెప్తున్నారు. 1996లో ఇండియాను, బాలీవుడ్‌ను వదిలేసి ఆధ్యాత్మిక వైపు అడుగులేశారు మమతా కులకర్ణి. 12 ఏళ్ల పాటు దుబాయ్‌లో జీవితాన్ని కొనసాగించారు. బాలీవుడ్ కెరీర్, ఫేమ్ అన్నీ వదిలేసి సన్యాసిగా మారారు. ‘కరణ్ అర్జున్’ అనే మూవీ హీరోయిన్‌గా మమతా కులకర్ణి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.