E-Paper

IND VS PAK: కొంప‌ముంచిన క్యాచ్ మిస్‌…టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

IND VS PAK:  కొంప‌ముంచిన క్యాచ్ మిస్‌…టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌
Advertisement

IND VS PAK:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఎడ్జ్ బస్టన్ ( Edgbaston, Birmingham)  వేదికగా ఆదివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (PAKISTAN Vs Team INDIA CLASH )  మహిళల జట్ల మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ అందుకుంది. పాకిస్తాన్ మహిళల జట్టు పైన టీమిండియా ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

64 పరుగుల తేడాతో పాకిస్తాన్ మహిళల జట్టును చిత్తు చేసిన టీమిండియా

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా మహిళల జట్టు.. 170 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దారుణంగా ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్… ఓటమిపాలైంది. 17 ఓవర్లలో 106 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్. ఈ క్రమంలో 64 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో టి20 లలో పాకిస్తాన్ పై 14 విజయాన్ని నమోదు చేసుకుంది ఇండియా.

పాకిస్తాన్ కొంపముంచిన క్యాచ్ మిస్

టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ కారణంగా ఓటమిపాలైంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ నమోదు చేసిన స్మృతి మందాన (Smriti Mandhana ) క్యాచ్ ను ఆలియా రియాజ్ వదిలేసింది. 27 పరుగుల వద్ద స్మృతి మందాన బ్యాటింగ్ చేస్తుండగా.. తస్మియా రుబాబ్ బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో స్మృతి మందాన పెద్ద షాట్ ఆడగా… బంతి గాల్లోకి ఎగిరింది.

Advertisement

అయితే ఆ బంతిని అందుకునే క్రమంలో ఆలియా రియాజ్ ( Aliya Riaz) చేతులెత్తేసింది. ఆ తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చిన స్మృతి మందాన 44 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఇందులో తొమ్మిది బౌండరీలతో పాటు రెండు సిక్సర్స్ ఉన్నాయి. అయితే స్మృతి మందానాను 27 పరుగుల వద్ద అవుట్ చేసి ఉంటే.. ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా పైన పాకిస్తాన్ గెలిచేదని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ ఒక్క క్యాచ్ కాకుండా చాలా మిస్టేక్ చేసింది పాకిస్తాన్. అందుకే ఓటమి పాలైంది.

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

 

Related News

రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ వెనుక గంభీర్‌, గిల్ కుట్ర‌లు, సెహ్వాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఫాతిమా షేక్ హ్యాండ్ ఇస్తాన‌ని ముందుకు వ‌చ్చినా హర్మన్​ప్రీత్ ఇవ్వ‌లేదు

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!

Babar Azam: టీమిండియాను పాకిస్తాన్ ప‌రువు కాపాడండి..లేక‌పోతే అక్క‌డే చావండి !

Fatima Sana: టీమిండియాను 100లోపే ఆలౌట్ చేసి, ప్ర‌తీకారం తీర్చుకుంటాం

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్…బిత్త‌ర‌పోయిన కోచ్ గంభీర్

×