E-Paper
Advertisement

60 ఏళ్లు దాటినా యూత్‌ఫుల్ లుక్స్.. దీర్ఘకాలం యవ్వనంగా, ఉత్సాహంగా కనిపించేందుకు సూపర్ ఫుడ్స్

60 ఏళ్లు దాటినా యూత్‌ఫుల్ లుక్స్.. దీర్ఘకాలం యవ్వనంగా, ఉత్సాహంగా కనిపించేందుకు సూపర్ ఫుడ్స్
Advertisement

పరుగులు తీసే ఈ జీవనంలో అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించపోతే త్వరగా ముసలితనం, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మంచి జీవనశైలితో పాటు కొన్ని సూపర్ ఫుడ్స్ తింటే 60 ఏళ్లు దాటినా ఉత్సాహంగా, యవ్వనంగా కనిపించవచ్చని ఆయుర్వేద, యునాని వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ సూచించారు. డాక్టర్ సలీం ప్రకారం.. సాంప్రదాయ ఆహారపు అలవాట్లలో కలొంజి, మెంతులు, నల్ల శనగలకు ప్రత్యేక స్థానం ఉంది. కలొంజిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన సహజ కాంపౌండ్స్ ఉంటాయి. మెంతుల్లో ఫైబర్, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. నల్ల శనగల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

రాత్రి పావు టీ స్పూన్ కలొంజి, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ నల్ల శనగలను నీటిలో నానబెట్టాలి. ఉదయం వాటిని బాగా నమిలి తినాలి. కావాలనుకుంటే మిగిలిన నీటిని కూడా తాగవచ్చు. ఈ అలవాటును సమతుల పోషకాహారంతో కలిపి పాటించడం మంచిది.

ఉదయం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది

Advertisement

ముందుగా ఆహారం తీసుకున్న తర్వాత సుమారు 20 నిమిషాల విరామం ఇవ్వండి. ఆ తర్వాత నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బాదంలో ‘విటమిన్ ఇ’ ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే అంజీర్‌లో ఫైబర్, ఖనిజాలు ఉంటాయి. ఎండుద్రాక్షలో సహజ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
రాత్రి ఐదు బాదం, ఐదు ఎండుద్రాక్ష, ఒక వాల్‌నట్, ఒక డ్రై అంజీర్‌ను విడివిడిగా నానబెట్టండి. ఉదయం బాదం పొట్టు తీసి మిగతా వాటితో పాటు బాగా నమిలి తినండి. కొందరు ఎండుద్రాక్ష లేదా అంజీర్ నానిబెట్టిన నీటిని కూడా తాగుతారు.

జీర్ణక్రియ కోసం సంప్రదాయ గింజల మిక్స్ ఉపయోగపడవచ్చు

జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీలకర్ర, వాము, సోంపును సమాన మోతాదులో తీసుకుని కొంచెం వేయించాలి. వాటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి.
ప్రధాన భోజనం తర్వాత ఒక టీ స్పూన్ మిశ్రమాన్ని బాగా నమిలి తినవచ్చు. తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు తాగితే మరింత సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Also Read: ప్రసవం తర్వాత జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి కారణాలు, చికిత్స తెలుసుకోండి

ఆరోగ్యకరమైన జీవనశైలే అసలు రహస్యం

ఆహారం ఒక్కటే ఆరోగ్యాన్ని కాపాడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర అవసరం. ఒత్తిడిని నియంత్రించాలి. రోజంతా సరిపడా నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉన్న సమతుల్య పోషాకాహారం తీసుకోవాలి.

గమనిక: ఏదైనా కొత్త ఆహారపు అలవాటు ప్రారంభించే ముందు, ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

బంగారు మోదక్స్‌కు భారీ డిమాండ్.. కిలో రూ.27000.. మీకూ కావాలా?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్.. కేవలం 10 నిమిషాల్లో తయారు చేసే 5 పాస్తా రెసిపీలు

మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

అవసరం తీరిపోయాక పట్టించుకోరు.. ఈ రాశుల్లో పుట్టినవారు స్వార్థపరులు

ఉదయం లేచినప్పటి నుంచి సిగరెట్ తాగే వ్యసనం.. ఈ చిట్కాతో కొన్ని నిమిషాల్లోనే మానేశాడు

పవిత్రమైన తులసి.. గణపతికి మాత్రం పెట్టరు.. ఎందుకో తెలుసా?

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. నవదంపతులు తప్పక పాటించాల్సిన 7 అందమైన సంప్రదాయాలు

ఏనుగు తల నుంచి 21 పత్రుల వరకు.. గణపతి గురించి 5 ఆసక్తికర విషయాలు!

Big Stories

Advertisement
×