E-Paper
Advertisement

బంగారు గొలుసు తీగ లాగితే కదిలే క్రైమ్ డొంక… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం క్రైమ్ కథ

బంగారు గొలుసు తీగ లాగితే కదిలే క్రైమ్ డొంక… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం క్రైమ్ కథ
Advertisement

Crime Thriller : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు చాలా ఉంటాయి. కానీ మొదటి 10 నిమిషాల నుంచే ప్రేక్షకుడిని కథలోకి లాగేసి, చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే సినిమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లలో ఒకటే ‘Officer on Duty’. 2025లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌కు జితు అష్రఫ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ రచయిత షాహీ కబీర్ కథను అందించారు. కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో తెలుగు సహా పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరిశంకర్ (కుంచాకో బోబన్) వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక విషాద ఘటన కారణంగా తీవ్ర మానసిక వేదనతో జీవిస్తుంటాడు. అదే సమయంలో డిపార్ట్‌మెంట్‌లో కూడా డిమోషన్ ఎదుర్కొని సాధారణ విధులు నిర్వహిస్తుంటాడు. ఒక రోజు నకిలీ బంగారు ఆభరణాలకు సంబంధించిన చిన్న కేసు అతని చేతికి వస్తుంది. మొదట ఇది చాలా చిన్న విషయం అనిపించినా, విచారణ ముందుకు సాగేకొద్దీ దాని వెనుక హత్యలు, యువతుల అదృశ్యాలు, బ్లాక్‌మెయిల్ నేర ముఠాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రతి ఆధారం మరో కొత్త నేరానికి దారి తీస్తుంది. ఒక్కో క్లూ బయటపడుతున్న కొద్దీ హరిశంకర్ తన గతంలో జరిగిన విషాదానికి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధం ఉందని గుర్తిస్తాడు. అక్కడి నుంచి కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఇంతకీ ఈ కేసుల వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? హరిశంకర్ తన వ్యక్తిగత గాయాలను పక్కన పెట్టి నేరస్థులను ఎలా పట్టుకున్నాడు? అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి కారణమైన నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా మిగతా కథ. ప్రతి 15–20 నిమిషాలకు వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడిని చివరి వరకు సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెడతాయి.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Officer on Duty 2025 ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. 2025 మార్చి 20 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

ఎందుకు చూడాలి?

Advertisement

‘Officer on Duty’ బలం దాని స్క్రీన్‌ప్లే. అనవసరమైన కామెడీ, కమర్షియల్ ఎలివేషన్లపై ఆధారపడకుండా పూర్తిగా కథ, సస్పెన్స్, పాత్రలపై దృష్టి పెట్టారు. కుంచాకో బోబన్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకదాన్ని అందించారు. ప్రియమణి, జగదీష్, విశాక్ నాయర్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు సినిమాకు మరింత బలం చేకూరుస్తాయి. డార్క్ క్రైమ్ థ్రిల్లర్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలు, ఊహించని ట్విస్టులు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. వీకెండ్‌లో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ మలయాళ థ్రిల్లర్లలో ఇది ఒకటి.

Read Also : ఈ అడవిలో ఫిజిక్స్ బయాలజీ పని చేయవు… ఒక్కసారి వెళ్తే తిరిగి రారు

Tags

Related News

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

ఇరుముడి నుంచి లస్ట్ ​స్టోరీస్ వరకు… ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన 7 క్రేజీ ప్రాజెక్ట్‌లు

Big Stories

Advertisement
×