BigTV English

IND vs SL: వరల్డ్ రికార్డ్ విక్టరీ.. శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

IND vs SL: వరల్డ్ రికార్డ్ విక్టరీ.. శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

IND vs SL: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. మూడో వన్డేలో వరల్డ్ రికార్డ్ విక్టరీ సాధించింది. లంకకు 391 పరుగులు భారీ టార్గెట్ ఇవ్వగా.. ఛేజింగ్ లో పూర్తిగా చతికిలపడ్డారు లంకేయులు. భారత్ బౌలింగ్ ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో, శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. సిరాజ్ నాలుగు వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ కు చెరో రెండు వికెట్లు తీశారు.


ఈ గెలుపు ప్రపంచ రికార్డు సాధించింది. గతంలో న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలవగా.. తిరువనంతపురం మ్యాచ్ లో భారత్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్స్ చెలరేగిపోయారు. శ్రీలంక బౌలింగ్ ను చితక్కొట్టుడు కొట్టారు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేశారు.


విరాట్ కోహ్లీ మళ్లీ వీరవిహారం చేశాడు. 110 బంతుల్లో ఏకంగా 166 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 13 ఫోర్లు, 8 సిక్స్ లతో తిరువనంతపురంలో విరాటపర్వం ఆవిష్కరించారు.

కోహ్లీతో పాటు శుభ్ మన్ గిల్ సైతం బ్యాట్ ఝలిపించాడు. 97 పరుగుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ లతో గిల్ 116 పరుగులు బాదేశాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులతో శుభారంభం అందించగా.. శ్రేయస్ 38 రన్స్ తో రాణించాడు. రాహుల్ (7), సూర్య (4) పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమారా, రజిత చెరో 2 వికెట్లు పడగొట్టారు. కరుణరత్నె ఒక వికెట్ తీశాడు.

తిరువనంతపురం మ్యాచ్ లో కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరుణరత్నె బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టగా.. ఆ బంతిని ఆపేందుకు ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా పరుగెత్తారు. ఆ క్రమంలో ఒకరినొకరు చూసుకోకుండా ఢీకొట్టుకోవడంతో గాయపడ్డారు. బండారాను స్ట్రెచర్‌ మీద ఆసుపత్రికి తరలించారు. వాండర్సే కూడా గాయపడినప్పటికీ.. అతడి పరిస్థితి నిలకడగానే ఉంది.

వన్డేల్లో 46 సెంచరీలు చేసిన కోహ్లీ.. సచిన్‌ తెందూల్కర్‌ పేరుపై ఉన్న రెండు రికార్డులు బద్దలుకొట్టాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. లేటెస్ట్ సెంచరీతో భారత్ లో కోహ్లీ శతకాల సంఖ్య 21కి చేరింది. 20 సెంచరీలతో సచిన్‌ సెకండ్ హయ్యెస్ట్ కి వెళ్లిపోయాడు.

ఇక, ఒకే జట్టుపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. శ్రీలంకపై 10 సెంచరీలతో సచిన్ రికార్డును అధిగమించాడు కోహ్లీ. మరోవైపు, వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్ మెన్ గా సచిన్ (49) స్కోరుకు మరింత దగ్గరగా వచ్చాడు విరాట్ కోహ్లీ(46). ఇంకో మూడు సెంచరీలు చేస్తే.. సచిన్ తో సమానం అయిపోతాడు. నాలుగు సెంచరీలు సాధిస్తే.. విరాట్ నెంబర్ 1 గా నిలుస్తాడు.

అటు, 12,754 రన్స్ తో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలోకి ఎగబాకాడు కోహ్లీ. సచిన్‌ 18,426 పరుగులతో అందరికంటే ముందున్నాడు.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×