BigTV English
Advertisement

NBK: మోక్షజ్ఞకి ఏమైంది? ఎందుకలా ఉన్నాడు?

NBK: మోక్షజ్ఞకి ఏమైంది? ఎందుకలా ఉన్నాడు?

NBK: మోక్షజ్ఞ. బాలకృష్ణ తనయుడు. నందమూరి వారసుడు. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమా మొదలవుతుందని.. నటనతో శిక్షణ కూడా తీసుకుంటున్నాడని.. ప్రచారం సాగుతోంది. పబ్లిక్ డొమైన్లో అంతగా కనిపించని మోక్షజ్ఞ.. ఈ సంక్రాంతికి నారావారిపల్లెలో సందడి చేశారు. తండ్రితో పాటు కనిపించి.. ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు.


భోగి నాడు చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్లలో కుటుంబంతో పాటు వీరసింహారెడ్డి చూశాడు. సంక్రాంతి నాడు చంద్రబాబు స్వగ్రామంలో జరిగిన పండుగ వేడుకల్లో పాల్గొన్నాడు. ఆ రెండు రోజులు తండ్రి బాలకృష్ణ వెంటనే ఉన్నాడు మోక్షజ్ఞ.

ఇంతవరకూ ఓకే. ఆ విజువల్స్ చూసిన ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. మోక్షజ్ఞ ఏ వీడియోలోనూ చురుకుగా కనిపించలేదు. నవ్వు ముఖమే లేదు. డల్ గా ఉన్నాడు. బాధలో ఉన్నట్టో.. ఏదో పోగొట్టుకున్నట్టో.. ఫేస్ పెట్టాడు.. అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కావాలంటూ మీరూ చూడండంటూ.. ఆ వీడియోలను షేర్లు కొడుతున్నారు.


త్వరలోనే మోక్షజ్ఞతో వెండితెర అరంగేట్రం చేయించాలని బాలకృష్ణ భావిస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఫస్ట్ మూవీ ఉంటుందని అంటున్నారు. బాలయ్య తనయుడు హీరో అంటే.. ఆయనలోనూ తండ్రిలానే అగ్రెసివ్ రోల్ లో ఊహించుకుంటారు. తొడగొట్టడాలు, కత్తి పట్టడాలు గట్రా.. ఇప్పుడే చేయకున్నా.. మరీ మిల్క్ బాయ్ రోల్ లో కాకుండా.. కాస్త రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ లోనే కనిపించాలనేది ఫ్యాన్స్ డిమాండ్. ఫైట్లు, డ్యూయట్లు తప్పనిసరి అంటున్నారు. మరి, మోక్షజ్ఞలో అలాంటి లుక్స్ లేవంటూ ఓ సెక్షన్ ప్రచారం చేస్తోంది.

బాలయ్య ఫేస్ గంభీరంగా ఉంటుంది. మోక్షజ్ఞకు తల్లి పోలికలు. ఇంకా లేలేత ముఖమే. అప్పుడే ఫ్యాక్షన్ స్టోరీలు, ఫైట్లు, పంచ్ డైలాగులు మోక్షజ్ఞ నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేమంటున్నారు. కాస్త సాఫ్ట్ క్యారెక్టర్స్ అయితేనే బెస్ట్ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అలాంటి అభిప్రాయాలకు బలం చేకూరేలా.. ఈ సంక్రాంతికి కనిపించిన మోక్షజ్ఞ లుక్ పై పెదవి విరుస్తున్నారు. హీరోగా పనికొస్తాడా? అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. మోక్షజ్ఞ రక్తంలోనే నటన ఉందని.. మేకప్ వేసుకుని.. యాక్షన్ చెప్పాక తెలుస్తుంది మనోడి టాలెంట్ అంటున్నారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×