
YS Sharmila news Today(Political news today telangana): మాజీ సీఎం, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా షర్మిళ కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు మరోసారి గుప్పుమంటున్నాయి. రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడని రాజశేఖర్ రెడ్డిని కొనియాడారు. వైఎస్సార్ సేవలు ఎప్పుడూ గుర్తుంటాయని అన్నారు.
రాహుల్ గాంధీ ట్వీట్‌ను షర్మిల రీ ట్వీట్ చేశారు. తన తండ్రి జ్ఞాపకాలను స్మరించుకున్నందుకు థాంక్యూ రాహుల్ గాంధీ గారూ అంటూ రెస్పాండ్ అయ్యారు. మీ నాయకత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైఎస్‌ఆర్ నమ్మారని ఆమె తెలిపారు. షర్మిల ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇప్పటికే కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో వరుస భేటీలు జరపడం.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ రావడం.. అంతా చూస్తుంటే.. ఆమె కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమని అంటున్నారు.
మరోవైపు, ప్రజాప్రస్థానం పాదయాత్రను మరోసారి మొదలుపెడతానని.. వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా.. ఖమ్మంలో షర్మిల కేక్ కట్ చేసి కార్యకర్తలతో పంచుకున్నారు. త్వరలోనే పాదయాత్ర ప్రారంభం అవుతుందని.. 4 వేల కిలోమీటర్ల ప్రస్థానాన్ని పాలేరు గడ్డ మీదే పూర్తి చేస్తామని తెలిపారు. నియోజక వర్గంలో ప్రతి గడపను కలుస్తానని చెప్పారు. పాలేరు మట్టి సాక్షిగా, ఇక్కడి ప్రజలకు రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను అందిస్తానని గతంలో హామీ ఇచ్చానని గుర్తు చేశారు షర్మిల.