Rohit Sharma – Devara: టీమిండియా స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కు ఎన్నో అఖండ విజయాలను అందించిన రోహిత్ శర్మ…. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరిగే… టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొన్న బంగ్లాదేశ్ జట్టుపైన టెస్టుసిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఇప్పుడు.. న్యూజిలాండ్ తో జరిగే… టెస్ట్ మ్యాచ్ లపై ఫోకస్ చేసింది. ఇలాంటి నేపథ్యంలోనే… ప్రాక్టీస్ చేస్తూ కనువిందు చేశాడు రోహిత్ శర్మ.
అయితే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ.. దేవర మ్యూజిక్ తో ఎంజాయ్ చేశాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన రోహిత్ శర్మ… దానికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన… దేవర బిజిఎం యాడ్ చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోని చూసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !
జూనియర్ ఎన్టీఆర్ దేవరాది బిజిఎం ఐతే… రోహిత్ శర్మది బ్యాటింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇటీవల రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది. మొదట నెగిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది జూనియర్ ఎన్టీఆర్ దేవర. మరో 20 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీ లో కూడా రిలీజ్ కాబోతుంది. కాగా దేవర సినిమాలో… జాన్వి హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">