Indian Cricketers: టీమిండియా క్రికెటర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో టీమిండియా క్రికెటర్లకు 250 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. టీమిండియా క్రికెటర్లు… 150 నుంచి 250 కోట్లు నష్టపోనున్నారట. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ కొత్త బిల్లు తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ దెబ్బకు… టీమిండియా ప్లేయర్ల ఆదాయం తగ్గనుంది. అందరు ప్లేయర్ల ఆదాయంపై 250 కోట్ల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
టీమిండియా ప్లేయర్లకు 250 కోట్ల నష్టం.. ఎలాగంటే?
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో.. గేమింగ్ యాప్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. తాజాగా మోడీ ప్రభుత్వం… ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ ను బ్యాన్ చేస్తూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేసింది మోడీ సర్కార్. దీంతో… ఇండియాలో ఉన్న పాపులర్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మొత్తం క్లోజ్ అవుతున్నాయి. ఈ దెబ్బకు టీమిండియా క్రికెటర్లు 150 నుంచి 250 కోట్లు నష్టపోతారని అంచనా వేస్తున్నారు.
డ్రీమ్ 11 ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ముగ్గురు కూడా డ్రీమ్ 11 తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అటు మై 11 సర్కిల్ కు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్, మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఎంపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్ కు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. విన్ జో కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అన్ని… క్లోజ్ కాబోతున్నాయి. ఈ దెబ్బకు టీమిండియా క్రికెటర్ల ఆదాయం కూడా తగ్గనుంది. మొత్తంగా టీమిండియా ప్లేయర్లు ఏడాదికి 150 నుంచి 250 కోట్లు.. ఈ గేమ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నారు. ఇక ఇవి పని చేయకపోతే ఆ డబ్బులు మొత్తం.. రావన్న మాట. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో టీమ్ ఇండియా ప్లేయర్లకు 250 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంది అని చెబుతున్నారు. ఇక అటు ఇప్పటికే టీమిండియా కు స్పాన్సర్ గా ఉన్న డ్రీమ్ 11… తన స్పాన్సర్షిప్ ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్పాన్సర్షిప్ కోసం టయోటా… పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.