BigTV English

IND vs ENG Third Test: ఇంగ్లాండ్‌తో థర్డ్ టెస్ట్.. టీమిండియా రికార్డుల మోత..

IND vs ENG Third Test: ఇంగ్లాండ్‌తో థర్డ్ టెస్ట్.. టీమిండియా రికార్డుల మోత..
IND vs ENG Third Test

IND vs ENG Third Test: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమ్ ఇండియా రికార్డుల మోత మోగించింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అలాగే డెబ్యూ మ్యాచ్ లో వేగంగా ఆఫ్ సెంచరీ చేసిన రికార్డ్ ను సర్ఫరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ చేసిన ఆల్ రౌండర్ జడేజా టెస్ట్ మ్యాచ్ ల్లో 3వేల పరుగుల మైలురాయిని దాటాడు.


ఫియర్‌లెస్ గేమ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు.

జడ్డూ భాయ్ విషయానికి వస్తే తన కెరీర్ లో ఇది నాల్గవ సెంచరీ. అలాగే తన కెరీర్ లో 3 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
నిజానికి తన హయ్యస్ట్ స్కోరు 175. మరి రెండోరోజు దానిని అధిగమిస్తాడా? లేదా? అనేది చూడాలి. అయితే బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డుని సర్ఫరాజ్ తో కలిసి 300 దాటించాడు.


Read More: రోహిత్, జడేజా సెంచరీల మోత.. తొలిరోజు టీమ్ ఇండియా 326 /5 ఆకట్టుకున్న సర్ఫరాజ్..

రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. టెస్ట్ మ్యాచ్ కెరీర్ లో 11వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో ఇంగ్లాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఓపెనర్ గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ 4 సెంచరీలతో ముందున్నాడు. రోహిత్ 3 సెంచరీలతో వెనుకున్నాడు. ఇంగ్లాండ్ పై వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో చేరాడు.

అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. 80 శతకాలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49), రోహిత్ శర్మ(47), జోరూట్ (46), స్టీవ్ స్మిత్ (44), కేన్ విలియమ్సన్(44) తర్వాతి స్థానాల్లో సీరియల్ గా ఉన్నారు.

సిక్సర్ల శర్మగా పేరున్న రోహిత్ టెస్ట్ ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ (91) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ (79) రెండో స్థానంలో నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ (78) సిక్స్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు

ఇక కెప్టెన్‌గా కూడా అత్యధిక సిక్సలు కొట్టిన మూడో బ్యాటర్ గా నిలిచాడు. ఇయాన్ మోర్గాన్ (233) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ (211), ధోనీ (211), రికీ పాంటింగ్ (171) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Related News

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Ritika Sajdeh: గంభీర్‌… నీకు కండ్లు దొబ్బాయా..నా మొగుడు ఎలా ఆడుతున్నాడో చూడు

Hardik Pandya GirlFriend: మ‌రో కొత్త పిల్ల‌ను ప‌డేసిన హార్దిక్ పాండ్యా..ఆ ఇద్ద‌రిని వ‌దిలేసి మ‌రీ !

Big Stories

×