BigTV English

Viral Ice Cream Video: వీడెంట్రా బాబు.. ఐస్ క్రీంతో పకోడి చేశాడు.. దీనిని ఎవరైనా తినగలరా..

Viral Ice Cream Video: వీడెంట్రా బాబు.. ఐస్ క్రీంతో పకోడి చేశాడు.. దీనిని ఎవరైనా తినగలరా..

Viral Ice Cream Video: ఎవరికైనా ఆహారం అంటే ఎందుకు ఇష్టం ఉండదు. అందులో ముఖ్యంగా కొత్తగా ట్రై చేయాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఈ తరుణంలో బయట స్టార్ హోటల్స్ దగ్గర నుంచి మొదలుకుని చిన్న టీ స్టాల్ వరకు రకరకాల వెరైటీలు ప్రీపేర్ చేస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా వైరల్ అవుతున్న వీడియోలను చూస్తూ కూడా చాలా మంది తమ ఇళ్లలో కూడా ప్రిపేర్ చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడివేడిగా ఏదైనా తయారు చేసుకుని తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో పకోడీలు, సమోసాలు తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. వర్షం వస్తుందంటే ఆ చల్లటి వాతావరణంలో వేడివేడిగా పకోడీలు, బజ్జీలు వేసుకుని తింటుంటారు.


ఇలా తయరుచేసుకునే క్రమంలో బజ్జీల్లో చాలా రకాలుగా ప్రీపేర్ చేస్తారు. ఇంట్లో, బయట కూడా ఆలు బజ్జీలు, ఎగ్ బజ్జీలు, మిర్చి బజ్జీలు, అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు ఇలా చాలా రకాల బజ్జీలు ఫేమస్ అవుతుంటాయి. అయితే ఇలాంటి కూరగాయలతో తయారు చేసే బజ్జీలు ఏవైనా సరే తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి. కానీ కొంత మంది మాత్రం విభిన్న రకాల బజ్జీలు తయారుచేస్తున్నారు. చాక్లెట్ బజ్జీలకు సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ సారి దర్శమిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ హోటల్ లో బజ్జీలు తయారుచేసే వ్యక్తి ఓ కొత్త రకమైన బజ్జీలు తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొత్త కొత్త ప్రయోగాలు కేవలం టెక్నాలజీపై మాత్రమే కాదు ఆహారంపై కూడా చేస్తుంటారు. తరచూ ఏదో ఒక కొత్త డిష్ ప్రిపేర్ చేసి సంపాదన పెంచుకోవాలని, కస్టమర్లని ఆకర్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా ఐస్ క్రీంతో ప్రయోగం చేశాడు. అది కూడా చాక్లెట్ ఐస్ క్రీం. చాక్లెట్ ఐస్ క్రీంతో బజ్జీలు వేశాడు. ముందుగా బజ్జీల పిండి తీసుకుని కొన్ని ఐస్ క్రీంలను ఆ పిండిలో ముంచి వేడివేడిగా మరుగుతున్న నూనెలో ఆ ఐస్ క్రీంని బ్జజీ పిండిలో ముంచి తీసి వేశాడు. ఇలా ఐస్ క్రీంతో బజ్జీలను తయారుచేశాడు. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి బజ్జీలు కూడా ఉంటాయని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోపై స్పందిస్తూ అసలు దీనిని ఎవరైనా తినగలరా అని కామెంట్స్ చేస్తున్నారు. మరో నెటిజన్ కామెంట్ చేస్తూ ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో అని భయాందోళన వ్యక్తం చేశాడు.


Related News

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Big Stories

×