BigTV English

Indian Team : స్కూల్ పిల్లల లాగా…. టీమిండియా ప్లేయర్లను లైన్ లో నిలబెట్టిన ఇంగ్లాండ్.. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

Indian Team : స్కూల్ పిల్లల లాగా…. టీమిండియా ప్లేయర్లను లైన్ లో నిలబెట్టిన ఇంగ్లాండ్.. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా?

Indian Team :  టీమిండియా మెన్స్ టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, ఉమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్  నేతృత్వంలో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు లండన్ లోని సెయింట్స్ జేమ్స్ ప్యాలెస్ లో కింగ్ ఛార్లెస్ IIIని కలిసిన విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిన చివరి క్షణాల గురించి ఛార్లెస్ చర్చించారు. భారత్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ ఔట్ కావడం ఆశ్యర్యకరం.. అతని బంతిని స్టంప్ పైకి తిప్పిన తరువాత షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే ఛార్లెస్ III  భారత కెప్టెన్ శుబ్ మన్ గిల్ ను చివరి బ్యాటర్ ఔటయ్యాక ఏమనిపించింది..? అని ప్రశ్నించాడు.


Also Read :  Rohit Sharma – London: కోహ్లీ బాటలో రోహిత్ శర్మ దంపతులు.. ఇండియాకు గుడ్ బై?

ఛార్లెస్ చాలా సరదాగా మాట్లాడాడు : గిల్ 


అందుకు గిల్ ఇలా సమాధానం ఇచ్చాడు. బ్రిటన్ రాజు ఛార్లెస్ మాతో చాలా సరదాగా మాట్లాడాడు. బంతి అనుకోకుండా స్టంప్స్ పైకి వెళ్లడంతో చివరి బ్యాటర్ సిరాజ్ ఔట్ అయ్యాడు. అది చాలా దురదృష్టకరం అన్నారు. వచ్చే రెండు మ్యాచ్ ల్లో రాణిస్తామని భావిస్తున్నట్టు సమాధానం చెప్పాడు గిల్. ఇంతకు ముందు ఇంగ్లాండ్ కి వచ్చిన.. కానీ తొలిసారిగా బ్రిటన్ రాజు ఛార్లెస్ ను కలిసే అవకాశం వచ్చిందని ఆయన ఎంతో స్నేహపూర్వకంగా సంభాషించారని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. కేవలం వీరు మాత్రమే కాదు.. ఇంకా చాలా క్రికెటర్లు ఛార్లెస్ ని కలిసిన తరువాత తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఛార్లెస్ ని కలిసే సమయంలో టీమిండియా ప్లేయర్లు లైన్ లో నిలబెట్టింది ఇంగ్లాండ్. సోషల్ మీడియాలో ఇంత కంటే దారుణం మరెక్కడైనా ఉంటుందా..?. స్కూల్ పిల్లలలాగా లైన్ లో నిలబెట్టారని కామెంట్స్ చేయడం విశేషం. 

పంత్ మాత్రం మహిళా క్రికెటర్లతో..! 

మరో ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. లార్డ్స్ టెస్ట్ తరువాత భారత పురుషుల జట్టు సభ్యులు ఒక అధికారిక కార్యక్రమంలో కింగ్ ఛార్లెస్ III ని కలిశారు. ఇక ఇదే సమయంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం అక్కడికి వచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో సరదాగా మాట్లాడటం కనిపించింది. సాధారణంగా ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో ఆటగాళ్లు చాలా సీరియస్ గా ఉంటారు. కానీ రిషబ్ పంత్ మాత్రం తనదైన శైలీలో నవ్వుతూ.. జోకులు వేస్తూ మహిళా క్రికెటర్లతో గడపడం అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లాండ్ 5 టీ-20 సిరీస్ ఆడింది. ఇక జులై 16 నుంచి సౌతాంప్టన్ లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రిషబ్ పంత్  వేలుకి గాయం కావడంతో నాలుగో టెస్ట్ కి ఈ కీలక ఆటగాడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

?igsh=cmdxdnFraDdmaW0y

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×