E-Paper
Advertisement

Insult to Ronaldo : రొనాల్డోకు అవమానం.. ఫ్యాన్స్ ఆగ్రహం..

Insult to Ronaldo : రొనాల్డోకు అవమానం.. ఫ్యాన్స్ ఆగ్రహం..
Advertisement

Insult to Ronaldo : కెప్టెన్‌, స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డో లేకుండానే ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ ఆడింది పోర్చుగల్‌. రోనాల్డో స్థానంలో పీప్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. రొనాల్డో ప్లేస్‌ను 21 ఏళ్ల రామోస్‌తో భర్తీ చేశారు. దాంతో… కోచ్‌ ఫెర్నాండో తీరుపై రొనాల్డో అభిమానులు విరుచుకుపడుతున్నారు. అయితే జట్టు వ్యూహాల్లో భాగంగానే రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కోచ్‌ ఫెర్నాండో చెబుతున్నాడు. అయినా ఫ్యాన్స్ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. రొనాల్డో స్థానంలో వచ్చిన రామోస్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టి స్విట్జర్లాండ్‌పై జట్టును గెలిపించాడు కాబట్టి సరిపోయింది కానీ… లేకపోతే రొనాల్డో ఫ్యాన్స్ రియాక్షన్ మరింత తీవ్రంగా ఉండేదని అంటున్నారు.

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎల్లో జెర్సీ వేసుకుని సబ్‌స్టిట్యూట్‌ బెంచ్‌ మీద నిర్లిప్తతో రొనాల్డో కూర్చుని ఉన్న దృశ్యాలు చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు. రొనాల్డో, రొనాల్డో అని నినాదాలు చేస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. మ్యాచ్‌ 74వ నిమిషంలో జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో మైదానంలోకి రాగానే… ఫ్యాన్స్ మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఆ సమయంలో కెప్టెన్ పీప్… రొనాల్డో చేతికి కెప్టెన్‌ ఆర్మ్‌బ్యాండ్‌ను చుట్టాడు.

Advertisement

స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడంపై అతని గర్ల్‌ఫ్రెం‍డ్‌ జార్జినా కూడా స్పందించింది. ”శుభాభినందనలు పోర్చుగల్‌! 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అభిమానుల కళ్లన్నీ​ నీ మీదే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్‌ లేకుండానే బరిలోకి దిగడం, నీ ఆటను ఆస్వాదించకుండానే ఆ 90 నిమిషాలు ముగిసిపోవడం నిజంగా సిగ్గుచేటు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది… జార్జినా. ”అభిమానులు నీకోసం వెదుకుతూనే ఉన్నారు. నీ పేరును కలవరిస్తూనే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల నీ ప్రియమైన స్నేహితుడు ఫెర్నాండో నీతో కలిసి నడవాలి. మరో మ్యాచ్‌లోనైనా నిన్ను చూసే అవకాశం ఇవ్వాలి” అని జార్జినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×