Inzamam-ul-Haq : ఆసియా కప్ 2025 లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మ్యాచ్ మ్యాచ్ కి తాను కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలుత 30, 31, 34, పరుగులు చేయగా.. మొన్న సూపర్ 4లో పాకిస్తాన్ జట్టు 74, నిన్న బంగ్లాదేశ్ పై 75 పరుగులు చేసి తను మెరుగైన ఆటగాడు అని మరోసారి నిరూపించుకున్నాడు. దీంతో టీమిండియాకి ఓపెనింగ్స్ లో తిరుగు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామూల్ ఉల్ హక్ సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read : Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ
ముఖ్యంగా అభిషేక్ శర్మ మూడో ఓవర్ వరకు పరుగులు చేయడానికి కష్టపడ్డాడు.కానీ అతని బ్యాట్ లో చిప్ ను ఇన్ స్టాల్ చేసేందుకు బీసీసీఐ మరో ఆటగాడిని పంపాడు. అప్పటి నుంచి అతను గట్టిగా కొట్టాడని సెన్షేషనల్ కామెంట్స్ చేశాడు. ఇంజమామ్ ఉల్ హక్ క్రికెట్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కేవలం పాకిస్తాన్ దేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇంజమామ్ ను అభిమానించేవారు.జట్టులోకి అడుగుపెట్టిన సంవత్సరానికే ప్రపంచ కప్ క్రికెట్ లో అద్భుతమే చేశాడు. ముఖ్యంగా అతను వన్డేల్లో పాకిస్తాన్ తరపున 11,739 పరుగులు చేసాడు. అంతేకాదు.. కెప్టెన్ గా కూడా జట్టుకు విజయాలనందించాడు. ఇంజమామ్ క్రీజులో ఉంటే.. ప్రత్యర్థి బౌలర్లకు దడ పుట్టేది. చాలా ఈజీగా సిక్స్ లు కొట్టేవాడు. కానీ రన్నింగ్ చేసేందుకు ఇష్టపడేవాడు కాదు.. చాలా సార్లు రనౌట్ అయ్యాడు ఇంజమామ్. బ్యాట్ తో మాత్రం పరుగుల వరద కురిపించాడు.
ఇక అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. పాకిస్తాన్ తో సూపర్ 4 లో జరిగిన మ్యాచ్ లో 39 బంతుల్లో 74 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 37 బంతుల్లో 75 పరుగులు చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించి అభిషేక్ ఖాతాలో ఓ రికార్డును సృష్టించాడు. ఆసియా కప్ టీ-20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ తరువాత వరుసగా రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిన అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్ లో భీకర ఫామ్ లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన అతను.. 206.67 స్ట్రైట్ రేట్ గతో 248 పరుగులు చేశాడు. వాస్తవానికి తొలి ఓవర్లు చాలా నిదానంగా ఆడింది టీమిండియా. ఆ తరువాత టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజులో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో 15 ఓవర్ల తరువాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత హార్దిక్ పాండ్యా పుంజుకోవడంతో టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.