Healthy Hair Tips: జుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో చాలా మందికి తలనొప్పిగా మారింది. వయసు పెరిగినా, తగ్గినా మనం నివసించే వాతావరణ, కాలుష్యం, తినే ఆహారం, మనం వాడే కెమికల్ షాంపూలు ఇవన్నీ కలసి జుట్టు బలహీనమై రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఒకసారి జుట్టు రాలడం మొదలైతే మనలో ఆందోళన పెరుగుతుంది. కానీ దీనికి మన ఇంట్లోనే సులభంగా చేసుకునే ఒక మంచి పరిష్కారం ఉంది.
ఎలా తయారు చేసుకోవాలి?
మన వంటింట్లో దొరికే టీపొడి, మెంతులు, బియ్యం, లవంగాలు ఇవన్నీ కలిపి ఒక సహజ హెయిర్ టానిక్ తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం చాలా సులభం. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీరు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ టీపొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ బియ్యం, రెండు మూడు లవంగాలు వేసి పది పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ మిశ్రమం గాఢరంగులోకి మారిన తర్వాత చల్లారనివ్వాలి. తరువాత వడగట్టి నీటిని వేరుగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మీరు వాడే సాధారణ షాంపూకి కలుపుకోవాలి. ప్రతి సారి జుట్టు కడుగుతున్నప్పుడు షాంపూకి ఒక స్పూన్ ఈ మిశ్రమం కలిపి వాడాలి. వారంలో కనీసం రెండు సార్లు ఇలా చేస్తే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.
Also Read: Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం
ఇలా వాడితే ఫలితం నిజంగా ఉంటుందా?
ఈ చిట్కా ఎందుకు పనిచేస్తుంది అంటే, టీపొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. మెంతులు జుట్టు రాలడాన్ని ఆపటమే కాకుండా కొత్త వెంట్రుకలు పెరగడానికి సహాయపడతాయి. బియ్యం సహజమైన కండీషనర్‌లా పని చేసి జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది. లవంగాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్
క్రమం తప్పకుండా వాడితే డాండ్రఫ్, దురద, పొడి తలచర్మం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే రసాయనాలతో చేసిన షాంపూలు తాత్కాలిక ఫలితం ఇస్తాయి. కానీ ఈ ఇంటి చిట్కా మాత్రం సహజంగానే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కావున వీటిని వాడితే మన జుట్టు అందంగా పెరగడమే కాకుండా.. సిల్కీగా తయారు అవుతుంది.
ఈ రెమిడీ వాడిన వారం రోజుల్లోనే ఫలితం
వారం లో రెండు సార్లు క్రమంగా వాడితే కొన్ని వారాల్లోనే మీ జుట్టు ఆరోగ్యంగా, దట్టంగా, మెరిసేలా మారుతుంది. అందమైన జుట్టు అంటే కేవలం అందం మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా. కాబట్టి ఒకసారి ఈ సహజ చిట్కా ప్రయత్నించండి మార్పు మీకే కనిపిస్తుంది.