Inzamam-ul-Haq: ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా, బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ (Tri Nation A Series in Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో సోమవారం టీమిండియా వర్సెస్ శ్రీలంక ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళగా, ఇరు జట్ల క్రికెటర్ల మధ్య గొడవ రాజుకుంది. వైభవ్ సూర్యవంశీ ( vaibhav Sooryavanshi fight) వర్సెస్ శ్రీలంక ప్లేయర్లు అన్నట్లుగా గొడవ సాగింది. అయితే ఈ సంఘటనలో వైభవ్.. సహనం కోల్పోయి శ్రీలంక ప్లేయర్ల కాలర్ పట్టుకున్నాడు. అయినప్పటికీ రంగంలోకి దిగిన ఐసీసీ, కేవలం శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగేపై (Vishen Halambage) ఫైన్ విధించింది. ఇప్పటి వరకు వైభవ్ ( vaibhav Sooryavanshi ) ఇక కూడా పీకలేదు. అయితే ఈ సంఘటనపై తాజాగా పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంక ప్లేయర్ విషెన్ హలంబగే ఒక్కడినే బలి చేస్తారా ? వైభవ్ ఏమైనా సుద్ధ పూసనా ? తన్ని తరిమికొట్టండి అంటూ ఇంజమామ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ట్రై సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక వర్సెస్ వైభవ్ సూర్యవంశీ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగేపై (Vishen Halambage) ఐసీసీ ఫైన్ వేయగా.. వైభవ్ ను వదిలేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక ప్లేయర్ విషెన్ హలంబగేకు ఒక న్యాయం? వైభవ్ సూర్య వంశీకి మరో న్యాయమా ? ఇదెక్కడి అన్యాయం అంటూ ఐసీసీ చైర్మన్ జై షా పై సీరియస్ అయ్యారు. జై షా ఇండియాకు సంబంధించిన వాడు కాబట్టే.. వైభవ్ లాంటి వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయ్యారు. అనవసరంగా శ్రీలంక కుర్రాడు విషెన్ హలంబగేని బలి చేశారని మండిపడ్డారు. శ్రీలంక ప్లేయర్ల కాలర్లు పట్టుకుంది… వైభవ్ సూర్యవంశీ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైభవ్ సూర్య వంశీ సుద్దపూస అన్నట్లుగా ఐసీసీ వ్యవహరిస్తుందని.. అతనిపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేశారు. జై షా అండదండలతో టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని.. రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 24 గంటల్లో వైభవ్ సూర్యవంశీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.