E-Paper
Advertisement

Podarillu Today Episode : కొట్టుకున్న కేశవ, చక్రీ.. మహా దెబ్బకు షాక్.. మాధవ్ ఫుల్ హ్యాపీ.. సర్ప్రైజ్ అదిరింది..

Podarillu Today Episode : కొట్టుకున్న కేశవ, చక్రీ.. మహా దెబ్బకు షాక్.. మాధవ్ ఫుల్ హ్యాపీ.. సర్ప్రైజ్ అదిరింది..
Advertisement

Podarillu Today Episode June 17th : నా తప్పు లేకపోయినా మీరు డబ్బులు కట్టారు.. అది నాకు బాధగా ఉందని చక్రి అనగానే లైసెన్స్ ఇవ్వమని ఎస్ఐ అడుగుతాడు. అయితే ఆ లైసెన్స్ తీసుకున్న ఎస్ఐ నువ్వు చాలా పొగరుగా మాట్లాడుతున్నావు.. నీ లైసెన్స్ ని ఒక నెలపాటు సీజ్ చేస్తాను అని చెప్తాడు.. మీరు ఇలా చెప్తే ఎలా ఉంటుంది అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కారు నడిపితే కానీ అతని జీవితం సాగదు అని ఓంకారేశ్వర్ ఎంత చెప్తున్నా సరే మాత్రం అసలు వినకుండా లైసెన్స్ తీసుకుంటాడు.. ఇంటికి వెళ్లిన చక్రి పోలీసులకు డబ్బులు ఇవ్వడం నాకు నచ్చలేదు అని మళ్లీ కేశవ గొడవ పడతాడు అది చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది..

కేశవతో గొడవపడ్డ చక్రీ..

నా పర్సులో ఉన్న డబ్బులు ఎందుకు తీసావ్ రా నీ చక్రి గొడవపడతాడు. కేశవ నీ పర్సులో ఉన్న డబ్బులు నాకోసం వాడలేదు రా.. నిన్ను బయటికి తీసుకు రావడానికి మాత్రమే వాడాను అని ఎంత చెప్తున్నా సరే.. అవి ఎందుకోసం నేను తీసాను నీకు తెలుసు కదా అని చక్రి సీరియస్ అవుతాడు.. ఎందుకు నువ్వు ఇంత ఇది చేస్తున్నావ్ నిన్ను జైల్లో నువ్వు ఉంటుంటే బాగుండేది అని కేశవ అడుగుతాడు. నేను అవి ఎందుకోసం దాచానో నీకు బాగా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు రా నీ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు.. వాళ్ళిద్దరూని గొడవ పడకుండా ఆపలేదని నారాయణ పై సీరియస్ అవుతుంది మహా.. వీళ్లిద్దరు గొడవ ఎక్కువైందని మహాలక్ష్మి ప్లేటు తీసి విసిరి కొడుతుంది. అది చూసిన పలు ఒక్కసారిగా గొడవ పడడం ఆపేస్తారు.. ఇంట్లో రోజు ఇదే పనా కొంచమైనా బుద్ధుందా మీకు అని తిడుతుంది మహాలక్ష్మి..

నారాయణకు క్లాస్ పీకిన మహా..

Advertisement

మహాలక్ష్మి గనుక చూస్తే నన్ను తిడుతుంది అని నారాయణ వాళ్ళు కొట్టుకుంటూ ఉండగా ఆపే ప్రయత్నం చేస్తాడు. అటు కన్నా కూడా వాళ్ళిద్దర్నీ కొట్టుకోవద్దని ఎంత చెప్తున్నా సరే వాళ్ళు కొట్టుకుంటూ ఉండటం చూసి మహాలక్ష్మి వచ్చి నారాయణను తిడుతుంది. పెద్ద మనిషి లాగా మీరు మధ్యలో ఉండి ఆపాల్సింది పోయి ఇలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటారా అని మహాలక్ష్మి తిడుతుంది. ఏం పెద్దమనిషి అయ్యా తండ్రి స్థానంలో ఉండి కొడుకులని సద్ది చెప్పాల్సింది పోయి ఇలా మళ్లీ చేస్తారని మహాలక్ష్మి తిడుతూనే ఉంటుంది.. చిన్నప్పటి నుంచి అలా వదిలేసారు కాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. చిన్నప్పటినుంచి మీరు భయం పెట్టి ఉంటే తండ్రి స్థానంలో ఉండి బాధ్యత తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా కొట్టుకునే వాళ్ళు కాదు అని మహాలక్ష్మి నారాయణను తిడుతుంది.. ఇక మహాలక్ష్మి సీరియస్ అవ్వడంతో అందరూ ఎటువంటి వెళ్ళిపోతారు.

కేశవ కోసం శైలు వెయిటింగ్..

మహాలక్ష్మి పెట్టిన తర్వాత కేశవ చాలా సీరియస్ గా అక్కడి నుంచి మెకానిక్ షాప్ కి వస్తాడు.. అయితే వాళ్లకి సాయం చేసిన తప్పే ఇంట్లో వాళ్లకి సాయం చేసిన తప్పే ఎవరికీ సాయం చేయకూడదు అని కేశవ అనుకుంటాడు. ఎందుకు అన్న బ్రో ఈ రోజు ఇంత సీరియస్ గా ఉన్నాడని చోటు మౌనంగా ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన శైలు ముంగిస నన్ను ప్రేమగా చూసుకుంటావా అని ఫోటో చూసి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక షాప్ దగ్గరికి రాగానే శైలు అటు ఇటు తిరుగుతుంది.. రోజు నాకోసం వెయిట్ చేసేవాడు ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు ఏమైంది వీడికి అని ఆలోచిస్తూ ఉండగా చోటు అన్న బ్రో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇకనుంచి వెళ్ళిపో తొందరగా అనేసి అంటాడు. మూడు బాగున్నపుడే వాడిని తట్టుకోలేము ఇప్పుడు సీరియస్ గా ఉన్నప్పుడు వెళ్తే ఇంక చంపేస్తాడు అని శైలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

తమ్ముళ్ళని తిట్టినా మాధవ్..

Advertisement

మాధవ ఇంట్లోకి రాగానే మహాలక్ష్మి ఏం జరిగింది అన్నది చెప్తుంది.. అసలు ఎందుకురా మీ ఇద్దరిలా కొట్టుకుంటున్నారు ఏమైంది అని అడుగుతాడు.. నిన్ను తీసుకురావడానికి వాడు నీ డబ్బులు తీసాడు కదా ఎందుకు నువ్వు వాడిని అంటున్నావు అని ఇద్దరికీ క్లాస్ పీకుతాడు. కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా ఎందుకు కొట్టుకుంటున్నారు? నా పెంపకంలో ఎక్కడ లోపం ఉన్నట్లుంది మిమ్మల్ని సరిగ్గా పెంచలేదేమో అని మాధవ్ ఇద్దరిని తిట్టి బాధపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మీరిద్దరు గొడవ పడుతూ ఉంటే ఆపడమే పని అయిపోతుందా అసలు ఒక అమ్మాయి ఉంది అని కూడా మీరు ఆలోచించకుండా ఇలా గొడవపడతారా ఇంక మారరని పెద్ది చాలా సీరియస్ అవుతాడు. అయితే మాధవ్ బాధపడడం చూసి మహాలక్ష్మి కూడా బాధపడుతుంది..

హమ్మయ్య.. మళ్ళీ కలిసిపోయిన బ్రదర్స్..

మహాలక్ష్మి చక్రికి అలాగే కేశవకి ఇద్దరికీ క్లాస్ పీకుతుంది ఇద్దరూ సరదాగా నవ్వుకోవడం అందరూ చూసి వీళ్లిద్దరూ ఇంక మారరా అని నవ్వుకుంటారు. బండి గురించి కేశవ చక్రి ఇద్దరు మాట్లాడుకోవడం చూసినా మహాలక్ష్మి వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే ఉంటారని నవ్వుతుంది. వీళ్ళిద్దరూ బాగానే సంతోషంగా ఉన్నారు మధ్యలోకి వెళ్లిన మనమే ఇక్కడ ఫూల్స్ అయ్యాము అని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు.. వీళ్లు చిన్నప్పుడు నుంచి అంతే అమ్మ గొడవ పడిన ప్రతిసారి ఇంకా క్లోజ్ అవుతుంటారు అని మాధవ్ అంటాడు. ఇక చక్రి మహాకు స్కూటీ కావాలని అడగని కేశవ సరే మంచి స్కూటీని తీసిస్తాను అని అంటారు.. తాగుదామని బార్ కి వెళ్ళను కానీ అక్కడ నారాయణ ఉండి క్లాస్ పీకగానే వచ్చేసాను అని చక్రి అంటాడు.

మహాను సర్ప్రైజ్ చేసిన మహా..

చక్రి ఉదయం తొందరగా లేవడంతో మాధవ్ ఏంట్రా అంత తొందరగా లేచవు అని అడుగుతాడు.. కేశవ ఇంకా లేవలేదు అని నీళ్ళు కొట్టి మరీ లేపి స్కూటీ కొనడానికి వెళ్దాం పదనేసి అంటారు.. మహాలక్ష్మికి ఎలాగైనా సరే స్కూటీని కొనుక్కొచ్చి ఇవ్వాలి రా వెళ్దాం పదరా అని కేశవాణి బలవంతంగా తీసుకొని వెళ్తాడు.. మొత్తానికి చక్రి కేశవ ఇద్దరు కలిసి మహాలక్ష్మి కోసం ఒక అదిరిపోయే స్కూటీని సెలెక్ట్ చేసి కొనేస్తారు. భార్యకి బహుమతిగా ఇచ్చే మొదటి గిఫ్ట్ ఇదే కాబట్టి అన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలి అని చక్రీ అంటాడు. మొత్తానికి చక్రి చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ వర్కౌట్.. బాలు మరదలు ఎంట్రీ.. ప్రభావతికి ఏమైంది..?

Related News

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Gundeninda Gudigantalu Balu : బాలు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త హీరో ఎంట్రీ..?

కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Wedensday Movies in Tv : బుధవారం సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

ఊచకోత కోస్తున్న దందా.. 28 ఏళ్ల కల నెరవేరింది- డైరెక్టర్ ఆదిత్య దేవులపల్లి

Big Stories

Advertisement
×