BigTV English

ipl 2023 : ఐపీఎల్ ఫస్ట్ హాఫ్.. డిసప్పాయింట్ చేసిన ఈ ముగ్గురు

ipl 2023 : ఐపీఎల్ ఫస్ట్ హాఫ్.. డిసప్పాయింట్ చేసిన ఈ ముగ్గురు

ipl 2023 : ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ఫస్ట్ హాఫ్ ముగిసింది. లీగ్ స్టేజ్‌లో 70 మ్యాచులు ఉంటే.. అందులో 35 మ్యాచ్‌లు అయిపోయాయి. ఒక్కో ఫ్రాంచైజ్ ఏడేసి మ్యాచ్‌లు ఆడారు. నాలుగు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ రెండు జట్లు ఆడిన ఏడు మ్యాచ్ లలో ఐదింట్లో గెలిచాయి. ఇక కొందరు ఆటగాళ్లు ఫెంటాస్టిక్ ఇండివిడ్యుయల్ పర్ఫామెన్స్ చూపిస్తే.. మరికొందరు చాలా దారుణంగా డిసప్పాయింట్ చేశారు.


1. పృథ్వీ షా
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఫస్ట్ హాఫ్ ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్. చెప్పాలంటే.. అందరి కంటే లీస్ట్‌లో ఉన్నాడు. ఆడింది ఆరు ఇన్నింగ్సులు. ఈ టోర్నమెంట్‌లో పృథ్వీ షా పరుగులు 7, 0, 15, 0, 13. మొత్తం కలిపితే చేసింది 47 పరుగులు. ఈ సీజన్ లో 20 ప్లస్ స్కోర్ చేసిందే లేదు. యావరేజ్ మరీ దారుణంగా 7.8. ఇక స్ట్రైక్ రేట్ 117. బెంగ తక్కువ స్కోర్ గురించి కాదు. షా ఔట్ అవుతున్న తీరు. పేస్ బౌలింగ్ అస్సలు ఫేస్ చేయలేకపోతున్నాడు. పృథ్వీ షా నుంచి ఇంత దారుణమైన ఆట ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్.

2. ఉమేష్ యాదవ్
కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేష్ యాదవ్… టీమిండియా బౌలింగ్‌కు పెద్ద దిక్కు. అలాంటి బౌలర్.. ఈ సీజన్ ఐపీఎల్‌లో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఎంత దారుణమైన పర్ఫామెన్స్ అంటే… ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్‌లో ఆడాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో తీసిన వికెట్లు కేవలం ఒకే ఒక్కటి. ఫస్ట్ మ్యాచ్‌లో 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంతే.. అప్పటి నుంచి వరుస ఆరు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీసింది లేదు.


3. దీపక్ హుడా
లక్నో సూపర్ జెయింట్స్ దీపక్ హుడాపై బాగా ఆశలు పెట్టుకుంది. వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ… ఏడు మ్యాచులు ఆడించింది. కాని, చేసిన పరుగులు మాత్రం జస్ట్ 41. పృథ్వీ షా కంటే దారుణమైన పర్ఫామెన్స్. స్ట్రైక్ రేట్ 80, యావరేజ్ జస్ట్ 5.8. ఫస్ట్ మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇక ఆ తరువాత ఆడిన ఆరు మ్యాచ్‌లలో 2, 7, 9, 2, 2, 2 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×