Big Stories

KKR vs PBKR IPL 2024 : ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ హిస్టరీ.. పోరాడి ఓడిన కోల్ కతా

KKR vs PBKR IPL 2024 Highlights : కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో భూకంపం వచ్చిందా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. ధనాధన్ పేళుళ్లు, దీపావళి బాణాసంచాను తలపించాయి. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తిపోయింది. అంత ఎత్తున గాల్లోకి లేచిన బంతులను చూసి అభిమానులందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇదికదా ఆటంటే అనుకున్నారు.

- Advertisement -

కోల్ కతా పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉంది. పంజాబ్ కింగ్స్ 9వ స్థానంలో ఉంది. అలాంటి జట్టు ఇలా విజృంభించి ఆడుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ 261 పరుగుల టార్గెట్ ను పంజాబ్ జట్టు ఛేదించింది. అంతేకాదు ఎన్నో రికార్డులను కొత్తగా సృష్టించింది.

- Advertisement -

టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా 6 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే అలవోకగా సాధించింది. ఐపీఎల్ హిస్టరీని షేక్ చేసింది.

వివరాల్లోకి వెళితే 262 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కి అద్భుతమైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తర్వాత అగ్నికి వాయువు తోడైనట్టు మరో ఓపెనర్ బెయిర్ స్టో విశ్వరూపమే చూపించాడు.

Also Read : డబ్బులు లేక రోడ్డుపై ధోని.. రూ.600 ఫోన్ పే చేయాలని మెసేజ్?

48 బంతుల్లో 9 సిక్సులు, 8 ఫోర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టుని విజయ పథంలో నడిపించాడు. అయితే వీరిద్దరే మ్యాచ్ ని ఫినిష్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభ్ సిమ్రాన్ రన్ అవుట్ అయిపోయాడు. అయ్యయ్యో..బ్రహ్మాండంగా ఆడేవాడు అవుట్ అయిపోయాడు. ఇక బ్రేక్ పడినట్టేనని అంతా తెగ బాధపడ్డారు.

తర్వాత రిలీ రసోవ్ వచ్చాడు. 16 బంతుల్లో 26 పరుగులు చకచకా చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి స్కోరు 2 వికెట్ల నష్టానికి 178 పరుగులతో ఉంది. కానీ వీరందరికంటే ఘనుడు ఒకడు వచ్చాడు. అతనే శశాంక్ సింగ్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు గ్రౌండులో భూకంపం వచ్చిందా? అన్నంత ధాటిగా ఆడాడు.

కేవలం 28 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సులు ఉన్నాయంటే చూడండి.. ఎంతటి విధ్వంసం జరిగిందో మీకే అర్థం అవుతుంది. మొత్తానికి సెంచరీ వీరుడు బెయిర్ స్టో తో కలిసి 262 పరుగుల టార్గెట్ ని అలవోకగా ఛేదించారు. ఐపీఎల్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు.

కోల్ కతా బౌలింగులో సునీల్ నరైన్ ఒక్కడికే ఒక వికెట్ పడింది. మొత్తం ఏడుగురు బౌలింగ్ చేశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా కూడా చాలా సాధికారికంగా ఆడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 32 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 71 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

తర్వాత వెంకటేష్ అయ్యర్ (39), ఆండ్రూ రసెల్ (24) తమవంతు ఆట ఆడారు. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 10 బంతుల్లో 3 సిక్సులు, 1 ఫోర్ సాయంతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రింకూ సింగ్ 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మొత్తానికి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.

ఒకానొక దశలో 300 పరుగులు కూడా దాటుతుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే 15.1 ఓవర్ కి వచ్చేసరికి 3 వికెట్ల నష్టానికి 203 పరుగులతో కోల్ కతా మంచి ఊపు మీద ఉంది. లాస్ట్ లో పంజాబ్ బౌలింగ్ కంట్రోల్ తప్పకపోవడంతో అంత ప్రమాదం జరగలేదు.

పంజాబ్ బౌలింగులో అర్షదీప్ 2, శామ్ కర్రన్ 1, హర్షల్ పటేల్ 1, రాహుల్ చాహర్ 1 వికెట్ పడగొట్టారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News