BigTV English

IPL 2024 : ఐపీఎల్ 2024.. వేలంలో ఉన్నది వీళ్లేనా?

IPL 2024 : ఐపీఎల్ 2024.. వేలంలో ఉన్నది వీళ్లేనా?
IPL 2024

IPL 2024 : ట్రేడింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ చెరొక ఆటగాళ్లను మార్చుకున్నాయి. రీటెన్షన్, ట్రేడింగ్ గడువు ముగుస్తుందనగా ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పు ఈ రెండు జట్ల మధ్య ప్రస్తుతానికి జరిగింది. ఆర్సీబీ నుంచి షాబాజ్ అహ్మద్‌ను తీసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..అందుకు బదులుగా మయాంక్ డాగర్‌ను ఇచ్చింది.


ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఆల్ రౌండర్ డాగర్‌ను గతేడాది వేలంలో హైదరాబాద్ జట్టు రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. 28 ఏళ్ల షాబాజ్ కోసం.. ఆర్సీబీ రూ.2.4 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు అదే ధరకు ఇరు జట్లు కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లను మార్చుకున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పలు నివేదికల ప్రకారం 10 ఫ్రాంచైజీలు పర్స్ వాల్యూని పెంచుకోవడంలో భాగంగా తమ ఖరీదైన ప్లేయర్లకు భారీ ఝలక్ ఇవ్వనున్నారు. గత ఎడిషన్ లో అంతగా ప్రభావం చూపించని ఆటగాళ్లపై వేటు వేయాలని డిసైడ్ అయ్యారు. ఆయా ఫ్రాంచైజీల నుంచి కొన్నిపేర్లు బయటకు వచ్చాయి.


చెన్నై సూపర్ కింగ్స్ నుంచి బెన్ స్టోక్స్,  జోఫ్రా, అర్చర్
 సన్ రైజర్స్ నుంచి ఫ్రథ్వీషా, హ్యారీ బ్రూక్
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మనీష్ పాండే, జాసన్ హోల్డర్
 రాజస్తాన్ రాయల్స్ నుంచి కేసీ కరియప్ప, మురుగన్ అశ్విన్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి అనుజ్ రావత్, యశ్ దయాళ్, దసున్ శనక
గుజరాత్ టైటాన్స్ నుంచి ఓడియన్ స్మిత్, ప్రదీప్ సంగ్వాన్ , ఉర్విల్ పటేల్, ఆండ్రీ రస్సెల్, ఎన్.జగదీశన్
కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి లాకీ ఫెర్గూసన్,  మణిదీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, ఎవిన్ లూయిస్, కైల్ జేమీసన్
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి మనీష్ పాండే, కె.గౌతమ్. ఐడెన్ మార్క్‌రమ్, ఇషాన్ కిషన్, జయదేవ్ ఉనద్కత్
ముంబై ఇండియన్స్ నుంచి రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, సందీప్ వారియర్, రిషి ధావన్,
పంజాబ్ కింగ్స్ నుంచి బి.రాజపక్స, రాజ్ అంగద్ బావ, మాథ్యూ షార్ట్

పైన పేర్కొన్న ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేసినట్టు సమాచారం. వీరికి డిసెంబర్ 19న దుబాయ్‌లో వేలం పాట జరుగుతుంది. ఈ ఆటగాళ్లను ఎవరైనా కొనుగోలు చేస్తే, వేరే జట్టులో చేరి ఆడే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంతేసంగతి. కాకపోతే వేరే జట్టు ఏదైనా అతనిని ప్రత్యామ్నాయ అవసరాల కోసం కొనుగోలు చేస్తే,  2024 IPLలో ఆడే అవకాశం ఉంటుంది.

ఈసారి ఖరీదైన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు నిర్దయగా తప్పించడం విశేషం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×