Big Stories

TS EAPCET Test Rescheduled : స్టూడెం‌ట్స్‌కు అలర్ట్.. TS EAPCET టెస్ట్ పరీక్షల తేదీల్లో మార్పు..

- Advertisement -

TS EAPCET Test New Schedule (Telangana today news) : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దాదాపు అదే సమయంలో TS EAPCET పరీక్షలు నిర్వహించాలని భావించింది విద్యాశాఖ. మే 9 నుంచి 12 వరకూ ఈ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ చేసింది. కానీ.. మే13 న పోలింగ్ ఉండటంతో అంతా గందరగోళంగా ఉంటుందని భావించిన ఉన్నత విద్యామండలి.. పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేసింది.

- Advertisement -

Also Read : 16 ఏళ్ల బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

మే 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ నిర్వహించాలని నిర్ణయించింది విద్యాశాఖ. కానీ.. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో.. ఐసెట్ పరీక్షను ఒక్కరోజు ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 5,6 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది. వివరాలకోసం https://icet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.

తెలంగాణ EAPCETకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 6వ తేదీ వరకూ సమయం ఉంది. మే 1 నుంచి హాల్ టిక్కెట్లు పొందవచ్చు. అలాగే.. మార్చి 7వ తేదీ నుంచి ఐసెట్ అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకూ, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News