Big Stories

CSK Vs LSG Highlights: చెన్నై వర్సెస్ లక్నో మ్యాచ్.. ఇద్దరు కెప్టెన్లకు భారీ జరిమానా..!

KL Rahul and Ruturaj Gaikwad Both Fined For Slow Over Rate: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి రెండు జట్ల కెప్టెన్లకు భారీ జరిమానా విధించారు. చెన్నై వర్సెస్ లక్నో మధ్య ఏక్ నా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది. రెండు జట్ల కెప్టెన్లు కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరికి కూడా స్లో ఓవర్ రన్ రేట్ ప్రకారం చెరో రూ.12 లక్షలు జరిమానా విధించారు.

- Advertisement -

ఒకే సీజన్ లో ఒకే మ్యాచ్ లో ఇద్దరు కెప్టెన్లకు కూడా జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు స్లో రన్ రేట్ కారణంగా చాలామంది క్రికెటర్లు లక్షలు లక్షలు కడుతున్నారు. మరి అవి ఫ్రాంచైజీ కడుతుందో, క్రికెటర్లే కడతారో తెలీదు.

- Advertisement -

వారి మ్యాచ్ ఫీజుల్లోంచి కట్టాలంటే, మాత్రం బాధాకరమే. ఎందుకంటే వారికి కాంట్రాక్టులు లక్షల్లో ఉంటాయి. ఈ కెప్టెన్లకు ఎంతకు పాడుకున్నారో తెలీదు. ఇలా రెండుసార్లు కట్టారంటే, ఈ సీజన్ అంతా ఫ్రీగా ఆడినట్టే లెక్కని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటివరకు 2024 సీజన్ లో శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా వీరందరూ స్లో  ఓవర్ రేట్ బాధితులే. ఇప్పుడు వీరి జాబితాలోకి రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ చేరారు.

Also Read: పాండ్యాకు షాక్.. రూ.12 లక్షల జరిమానా..

మరికొందరు ఏమంటున్నారంటే ఆటగాళ్లందరూ కలిసి కడతారు. అంటే జట్టులో 11 మంది ఉంటే, తలా ఒక లక్ష చొప్పున వేసుకుని కట్టేస్తారు. ఎందుకంటే అందరి బాధ్యత కదా.. ఇది, ఒక్క కెప్టెన్ పైనే వేయరని కొందరంటున్నారు. అది అంతర్గత సర్దుబాటు జరుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా బీసీసీఐ ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా కెప్టెన్లు ఎవరూ లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయలు కట్టడానికైనా వెనుకడాటం లేదని కొందరు అంటున్నారు. అయితే ఆటలో పడి కొందరు టైమ్ పట్టించుకోరని, ఒత్తిడి అటువంటిదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి పెనాల్టీ దెబ్బ మాత్రం నెటిజన్లకు మంచి పనే పెట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News