Big Stories

Hardik Pandya: పాండ్యాకు షాక్.. రూ.12 లక్షల జరిమానా..

Hardik Pandya Fined For Slow Overrate: ముంబై ఇండియన్స్ గెలిచింది కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవ లేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ పై మొదట్లో ఎంత గొప్పగా బౌలింగు చేసిందో చివరికి వచ్చేసరికి, అంతే స్థితిలో పరిస్థితిని పీకల మీదకు తెచ్చేసుకుంది. ఆల్ రౌండర్ అశుతోష్ చితక్కొట్టి వదిలాడు. దీంతో మిడిల్ ఓవర్లలో బౌలింగు వీక్ గా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దశలో గెలిచినా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయింది.

- Advertisement -

ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయడంలో ముంబయి విఫలమైనట్లు ఐపీఎల్ అడ్వయిజరీ కమిటీ వెల్లడించింది. దీంతో చివరి రెండు ఓవర్లలో సర్కిల్ అవతల కేవలం నలుగురు ఫీల్డర్లతోనే ఆడాల్సి వచ్చింది.

- Advertisement -

ఈ సందర్భంగా ఐపీఎల్ కమిటీ ఒక ప్రకటనలో.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించామని పేర్కొంది.

అయితే  పంజాబ్ కింగ్స్ 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి మ్యాచ్ ను గెలిచే స్థితికి చేరుకుంది. కానీ చివరి ఓవర్ లో 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విషయంపై హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ మ్యాచ్ లో ఎప్పుడేం జరుగుతుందో తెలీదని అన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో ఏదీ మన చేతిలో ఉండదని అన్నాడు. గెలుస్తామని అనుకున్న మ్యాచ్ ఓడిపోతామని, ఓడే మ్యాచ్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని వేదాంత ధోరణిలో చెప్పాడు.

Also Read: Ashutosh Sharma: పేదింటి నుంచి.. క్రికెటర్‌గా ఎదిగిన అశుతోష్ ప్రస్థానం ఇదే..!

ఆఖరి బాల్ వరకు ఏదీ నిజం కాదని అన్నాడు. మొత్తానికి పంజాబ్ ఓడినా హార్దిక్ మాత్రం ఇంకా షాక్ నుంచి కోలుకున్నట్టు లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే  అశుతోష్ ఆట తీరును మాత్రం హార్దిక్ పాండ్యా మెచ్చుకున్నాడు. తను ప్రతి బంతిని చక్కగా ఆడాడు. తను ఆడిన ఇన్నింగ్స్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసిందని అన్నాడు. తనకి భారత క్రికెట్ లో మంచి భవిష్యత్తు ఉందని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News