Big Stories

MI Vs CSK Highlights: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది.. ముంబాయ్ Vs చెన్నై మ్యాచ్ హైలెట్స్

IPL 2024 Mustafizur Rahman Sensational Catch: ఒక్క క్యాచ్ మ్యాచ్ నే మార్చేస్తుందా? అంటే అవునని అందరూ అంటున్నారు. అదే ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో జరిగింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో చెన్నై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ముఖ్యంగా ఫీల్డింగ్ లో కూడా అదరగొట్టింది. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శన వల్ల చెన్నై చక్కని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద చెన్నై ఫీల్డర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. అది కూడా మరెవరిదో కాదు.

- Advertisement -

టీ 20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన బంతిని బౌండరీ లైను వద్ద ఒడిసి పట్టాడు. దాంతో డకౌట్ గా సూర్య వెనుతిరిగాడు. ముంబై ఇన్నింగ్స్ 8వ ఓవర్ నడుస్తోంది. పతిరాన వేసిన తొలి బంతికే ఇషాన్ కిషన్ ను అవుట్ చేశాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా సూర్య వచ్చాడు. అయితే అదే ఓవర్ లో మూడో బంతిని పతిరన అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గా దిశగా, షార్ట్ లెంగ్త్ బంతిని సంధించాడు.

- Advertisement -

అయితే సూర్య ఏం చేశాడు..360 డిగ్రీల్లో తిరిగి కొడతాడు కదా.. అలా అప్పర్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. అయితే సరిగా కనెక్ట్ కాలేదు. దాంతో అది సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ల్యాండ్ అయ్యింది. అక్కడే ఫీల్డింగ్ లో ఉన్న ముస్తాఫిజుర్ ఏం చేశాడు? కొద్దిగా లెఫ్ట్ సైడ్ జంప్ చేసి క్యాచ్ అందుకున్నాడు.

అయితే బ్యాలన్స్ ఆపుకోలేక బౌండరీ అవతలకి వెళ్లాడు.. కానీ వెళుతూ వెళుతూ తెలివిగా బాల్ ని గాల్లోకి విసిరేసి, మళ్లీ బౌండరీ లోపలికి వచ్చి గాల్లో ఉన్న బంతిని చక్కగా అందుకున్నాడు. దీంతో సూర్యా ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు.

Also Read: రోహిత్ సెంచరీ వృథా.. ధోనీ సేన ఘన విజయం..

ఇప్పుడీ క్యాచ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News