Big Stories

Iran- Israel War: ప్రతీకారం తీరిందన్న ఇరాన్.. ప్రతిదాడి చేస్తామన్న ఇజ్రాయెల్.. అమెరికా ఆగ్రహం!

Iran- Israel War Update: ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించడంతో.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని యావత్ ప్రపంచం భయపడింది. 300 డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్.. ఇజ్రాయెల్ పై విరుచుకుపడగా.. వాటిలో 99 శాతం వెపన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. సౌత్ ఇజ్రాయెల్ లో ఐడీఎఫ్ క్యాంప్ ను ధ్వంసం చేసింది. ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించిన వేళ.. అగ్రరాజ్యం సహా.. ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశంపై దాడులను ఖండించాయి.

- Advertisement -

ఇరాన్ చేసిన దాడిని ఇజ్రాయెల్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. పెనునష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడింది. శత్రుదేశాన్ని చాకచక్యంగా వెనక్కిపంపింది. ఇరాన్ మొదలుపెట్టిన యుద్ధకాండ ఎక్కడికి దారితీస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ పై తాము చేసిన దాడి.. ప్రతీకార చర్యేనని స్పష్టం చేసింది. ఈ దాడిలో తాము విజయవంతమయ్యామని, ఇక ఇజ్రాయెల్ పై దాడి చేసే ఉద్దేశ్యం లేదని ఇరాన్‌ సైనిక దళాల అధిపతి జనరల్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ బగేరి తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ లో పేర్కొన్న ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది.

- Advertisement -

ప్రస్తుతానికైతే ఇరాన్ వెనక్కి తగ్గింది. కానీ.. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తామని ప్రకటించడం మరో ఆందోళనకు తెరలేపింది. ఇజ్రాయెల్ ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పై ప్రతిదాడి చేయొద్దని, కాదని చేస్తే ఇకపై తాము సహకరించబోమని జో బైడెన్ ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. బైడెన్ హెచ్చరికతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుందా ? లేక ప్రతీకారమే ముఖ్యమని ప్రతిదాడి చేస్తుందా ? అన్నది ప్రశ్నార్థకం.

Also Read: ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్ల దాడి.. ఖండించిన ఐరాస సెక్రటరీ జనరల్

కాగా.. ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి రెండ్రోజుల ముందు నుంచే.. దాడి చేస్తామని చెబుతూ వచ్చింది. చెప్పిన మాటప్రకారమే దాడి చేసింది. ఆదివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో చేసిన ఈ దాడిలో ఇరాన్.. దశలవారిగా డ్రోన్లను ప్రయోగించింది. 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్ లు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడిచేసింది. ఇరాన్ దాడితో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా యుద్ధ సైరెన్లు మోగించి.. ప్రజలను అప్రమత్తం చేసింది. పౌరులెవరూ బయటకు రావొద్దని సూచించింది.

ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తమ దగ్గరున్న రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. ఇరాన్ కు లెబనాన్, సిరియా, ఇరాక్ మిలిటెంట్ సంస్థలు మద్దతుగా నిలువగా.. ఇజ్రాయెల్ కు అండగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ అండగా నిలిచి.. డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడంలో సహాయపడ్డాయి. ఇరాన్ వందలాది డ్రోన్లను ప్రయోగించగా.. కేవలం 7 డ్రోన్లు మాత్రమే టార్గెట్ ను చేరాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News