E-Paper
Advertisement

CSK Vs GT Match Preview: సీఎస్కే ముందడుగు వేస్తుందా..? నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్!

CSK Vs GT Match Preview: సీఎస్కే ముందడుగు వేస్తుందా..? నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్!
Advertisement

IPL 2024 59th Match – Gujarat Titans Vs Chennai Super Kings Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ కి వెళ్లే మ్యాచ్ లపై అందరికీ ఒక అంచనాలు వచ్చేశాయి. అయితే ఇంతవరకు వెనకా ముందు ఆడిన హైదరాబాద్ ఒక్కసారి మళ్లీ రన్ రేట్ పెంచుకుని ప్లే ఆఫ్ రేస్ లోకి వచ్చేసింది. దీంతో చెన్నయ్ రిస్క్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ సేన నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

చెన్నై ఇంతవరకు 11 మ్యాచ్ లు ఆడి 6 గెలిచింది. 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ పరిస్థితి అయితే అత్యంత ఘోరంగా ఉంది. 11 మ్యాచ్ లు ఆడి 4 మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్ లు జరిగాయి. చెరో 3 విజయం సాధించాయి.

Advertisement

గుజరాత్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఫామ్ లో లేకపోవడం జట్టుకి పెద్ద మైనస్ గా మారింది. తన తర్వాత గొప్పగా ఆడే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో ఈసారి గుజరాత్ ముందంజ వేయలేకపోయింది. స్టార్ ప్లేయర్ల కొరత పట్టి పీడిస్తోంది. మరి ఇదే జట్టుతో హార్దిక్ పాండ్యా ఒకసారి కప్పు కొట్టాడు. రెండోసారి ఫైనల్స్ వరకు తీసుకువెళ్లాడు, దానికేమంటారని మరికొందరు అంటున్నారు.

Also Read: విరాట్ సెంచరీ మిస్ అయినా.. ఆర్సీబీ ఘన విజయం

Advertisement

నాయకత్వ లోపమేనని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి  చెన్నయ్ తో జరిగే మ్యాచ్ లో గిల్ గెలవకపోతే, రాబోవు సీజన్ లో కెప్టెన్సీకే ఎసరు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలీదు.

చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం సూపర్ గా ఆడుతున్నాడు. తనకి సపోర్టుగా ఒకొక్కసారి శివమ్ దుబె, డేరీ మిచెల్, రవీంద్ర జడేజా నిలుస్తున్నారు. ఫినిషింగ్ ధోనీ చూస్తున్నాడు. మొత్తానికి అద్భుతాలేమీ జరగడం లేదు కానీ, ఉన్నంతలో బాగానే వెళుతోంది.

మరి నేడు రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×