BigTV English

KKR vs RR IPL 2024 Preview: నేడు కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

KKR vs RR IPL 2024 Preview: నేడు కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

kolkata knight Riders vs Rajasthan Royals IPL 2024 Prediction: ఇద్దరు సమ ఉజ్జీల మధ్య పోరాటం ఎలా ఉంటుందో చూడాలంటే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సిందే. ప్రస్తుతం కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు ఇలా టాప్ వన్, టూ స్థానాల్లో ఉంటాయని ఎవరూ ఊహించలేదు. క్రికెట్ లో ఊహకు అందనివే జరుగుతుంటాయని అంటారు. అది నిజమని రెండు జట్లు నిరూపించాయి.


ఇప్పుడా రెండు జట్ల మధ్య రాత్రి 7.30కి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల టేబుల్ పట్టికలో టాప్ వన్ లో ఉంది. కోల్ కతా దాని తర్వత టాప్ 2 స్థానంలో ఉంది.  దీంతో రెండు సమ ఉజ్జీల మధ్య పోరుగా అందరూ అభివర్ణిస్తున్నారు.

ఇప్పటివరకు వీరిమధ్య 28 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో రాజస్థాన్ 14 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే, కోల్ కతా 13 గెలిచింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. ఈ రెండు జట్ల మధ్య హయ్యస్ట్ స్కోరు చూస్తే రాజస్థాన్ 217 చేస్తే, కోల్ కతా 210 చేసింది.


Also Read: సన్ రైజర్స్ మళ్లీ దంచికొట్టారు.. ఆర్సీబీపై ఘన విజయం

ఇంక బలాబలాల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కెప్టెన్ గా ఉన్నాడు. బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఇకపోతే యశస్వి జైశ్వాల్ ఇప్పుడే టచ్ లోకి వచ్చాడు. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, జాస్ బట్లర్, శుభమ్ దుబె ఇలా అందరూ చక్కగా ఆడుతున్నారు.

అలాగే బౌలింగు విభాగం బలంగా ఉంది. కుల్దీప్ సేన్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, కేశవ్ మహరాజ్, అశ్విన్ ఇలా ఒకరి తర్వాత ఒకరి ఆప్షన్స్ బాగున్నాయి. అందువల్ల 6 మ్యాచ్ లకి ఒకటి మాత్రమే ఓడి 5 మ్యాచ్ ల్లో విజయం సాధించి నెంబర్ వన్ స్థానంలో ఉంది.

కోల్ కతా విషయానికి వస్తే ఓపెనర్ల దగ్గర నుంచి సిక్స్త్ డౌన్ వరకు అందరూ హార్డ్ హిట్టర్లే…వీడు పోతే వాడు అన్నట్టు, ఒకడు పోతే ఒకడొచ్చి దంచికొట్టి వెళ్లిపోతున్నారు. దీంతో వీరు 5 మ్యాచ్ లు ఆడి ఒకటి ఓడి, నాలుగు గెలిచి ముందంజలో ఉన్నారు.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్న జట్టులో రింకు సింగ్, రూథర్ ఫర్డ్, అంగ్ క్రిష్ రఘువంశీ, నితీష్ రాణా, ఫిల్ సాల్ట్,  వెంకటేష్ అయ్యర్ ఇరగదీస్తున్నారు.  ఇంక బౌలింగులో మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్ ఇలా అందరూ సూపర్ ఫామ్ లో ఉండటం కోల్ కతాకి కలిసి వస్తోంది.

మరి నేటి మ్యాచ్ లో రెండు జట్ల మధ్య ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×