Rishabh Pant IPL Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మెగా వేలం ముగిసిన నేపథ్యంలో… ఇప్పుడు ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి అనే దాని పైన చర్చ జరుగుతోంది. ఈసారి జరిగిన మెగా వేలంలో రిషబ్ పంతు అత్యధిక ధర పలికాడు. 27 కోట్లకు టీమిండియా వికెట్ కీపర్ ను లక్నో పోటీపడి కొనుగోలు చేసింది. మెగా వేలంలో హైదరాబాద్ జట్టుతో పాటు లక్నో కూడా…రిషబ్ పంత్ ( Rishabh Pant) కోసం… పోటీ పడింది. కానీ చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ RTM కార్డును వాడింది. ఈ నేపథ్యంలోనే… రిషబ్ పంత్ ( Rishabh Pant) కోసం 27 కోట్లు ఆఫర్ చేశారు లక్నో ఓనర్ సంజీవ్.
also read: Sanjiv Goenka: డేంజర్ లో పంత్ కెరీర్.. ధోని, కేఎల్ రాహుల్ కు పట్టిన గతే..?
దీంతో తెలివిగా ఢిల్లీ క్యాపిటల్స్ వేలం నుంచి తప్పుకుంది. దీంతో 27 కోట్లకు.. రిషబ్ పంత్ ( Rishabh Pant) ను కొనుగోలు చేసింది లక్నో. అంటే లెక్క ప్రకారం రిషబ్ పంత్ ఖాతాలో 27 కోట్లు పడాలి. కానీ భారత చట్టాల ప్రకారం అంత అమౌంట్ రిషబ్ పంత్ ఖాతాలో పడదు. చాలా వరకు టాక్సీలు కట్ కావడం జరుగుతుంది. దాదాపు 8.1 కోట్ల వరకు జీఎస్టీ ఇతర టాక్సీలు విధిస్తారు. ఈ లెక్కన రిషబ్ పంత్ చేతికి కేవలం 18.9 కోట్లు మాత్రమే వస్తాయన్నమాట.
Also Read: Sachin Tendulkar: కొడుకు కోసం సచిన్ అలా చేశాడా? సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్
అంటే దాదాపు 40 శాతం వరకు తన జీతాన్ని… ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో కట్టబోతున్నాడు. రిషబ్ పంత్ ( Rishabh Pant) ఒక్కడికే కాకుండా… మెగా వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు టాక్సీలు కట్టాల్సిందే. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇది ఇలా ఉండగా… లక్నోకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. పంతును అందుకే కొనుగోలు చేసింది లక్నో జట్టు. KL రాహుల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు 27 కోట్లు పెట్టి మరి అతన్ని కొనుగోలు చేశారు. కచ్చితంగా రిషబ్ పంతుకు కెప్టెన్సీ ఇచ్చి నికోలాస్ పూరన్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా… కేఎల్ రాహుల్ అలాగే లక్నో ఓనర్స్ సంజీవ్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. అందుకే లక్నో వదిలేసాడు కేఎల్ రాహుల్.
LSG వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా:
1. రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు
2. ఐడెన్ మార్క్రామ్ – రూ. 2 కోట్లు
3. డేవిడ్ మిల్లర్ – రూ.7.5 కోట్లు
4. మిచెల్ మార్ష్ – రూ. 3.4 కోట్లు
5. అవేష్ ఖాన్ – రూ. 9.75 కోట్లు
6. అబ్దుల్ సమద్ – రూ. 4.2 కోట్లు
7. ఆర్యన్ జుయల్ – రూ. 30 లక్షలు
8. ఆకాష్ దీప్ – రూ. 8 కోట్లు
9. హిమ్మత్ సింగ్ – రూ. 30 లక్షలు
10. ఎం సిద్ధార్థ్ – రూ. 75 లక్షలు
11. దిగ్వేష్ సింగ్ – రూ. 35 లక్షలు
12. షాబాజ్ అహ్మద్ – రూ. 2.4 కోట్లు
13. ఆకాష్ సింగ్ – రూ. 30 లక్షలు
14. షామర్ జోసెఫ్ – రూ. 75 లక్షలు
15. ప్రిన్స్ యాదవ్ – రూ. 30 లక్షలు
16. యువరాజ్ చౌదరి – రూ. 30 లక్షలు
17. రాజవర్ధన్ హంగర్గేకర్ – రూ. 30 లక్షలు
18. అర్షిన్ కులకర్ణి – రూ. 30 లక్షలు
19. మాథ్యూ బ్రీట్జ్కే – రూ. 75 లక్షలు