BigTV English

Sona Dey – Hardik: పాండ్యా లైఫ్ లోకి మరో లేడీ… స్టేడియంలోనే ప్రపోజ్

Sona Dey – Hardik: పాండ్యా లైఫ్ లోకి మరో లేడీ… స్టేడియంలోనే ప్రపోజ్

Sona Dey – Hardik: ఐపీఎల్ 2025 సీజన్ లోని 20వ మ్యాచ్ సోమవారం రోజు ముంబై ఇండియన్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోని ముంబై ఇండియన్స్ {MI} ఈ సీజన్ లో నాలుగో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 221 పరుగులు చేసింది.


 

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు 209 పరుగులు మాత్రమే చేసి.. లక్ష్యానికి దగ్గరగా వచ్చి గెలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఇలాంటి ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. అదేంటంటే.. టి-20 క్రికెట్లో 5వేలకు పైగా పరుగులు సాధించడమే కాకుండా 200 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు.


హార్దిక్ పాండ్యా కి ముందు ఏ భారత ఆటగాడు కూడా ఈ ఘనతను సాధించలేదు. ఆర్సిబి తో జరిగిన ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లతో పాటు నాలుగు సిక్సర్లు కొట్టాడు. అంతేకాకుండా బౌలింగ్ లో కూడా అద్భుతాలు చేశాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 45 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ” ఇది కష్టమైనా ట్రాక్. బౌలర్లకు ఎక్కువగా ఎంపికలు లేవు. ఈ మైదానంలో బ్యాట్స్మెన్ ను ఆపవచ్చు. నేను బౌలర్ల పై కఠినంగా ఉండకూడదని అనుకుంటున్నాను. నమన్ ధీర్ సాధారణంగా బ్యాటింగ్ ఆర్డర్ లో.. లోయర్ ఆర్డర్ లో అడగడు. కానీ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం వల్ల అతడు గత మ్యాచ్లో ముందుగా వచ్చాడు. రోహిత్ తిరిగి రాగానే.. నమన్ లోయర్ ఆర్డర్ లో దిగాల్సి వచ్చింది. ఇక తిలక్ వర్మ చాలా తెలివైనవాడు. గత మ్యాచ్ నుండి త్వరగా రికవరీ అయ్యాడు” అని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ ముంబై లేడీ ఫ్యాన్ మైదానంలో హార్దిక్ పాండ్యాకి ప్రపోజ్ చేసింది. “సోనా దే” అనే ముంబై ఇండియన్స్ లేడీ ఫ్యాన్.. స్టాండ్స్ లో హార్దిక్ పాండ్యాకి ప్రపోజ్ చేస్తున్న ఫ్లకార్డ్ పట్టుకొని కనిపించింది. దీంతో ఆ లేడీ ఫ్యాన్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

 

లవ్ ప్రపోజ్ చేసిన రోజే నిశ్చితార్థం చేసుకున్నాడు. హార్దిక్ – నటాషా ఫ్రెండ్స్ అయ్యాక 2020 న్యూ ఇయర్ సందర్భంగా డేటింగ్ కి వెళ్లారు. సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో హార్దిక్.. నటాషాకి ప్రపోజ్ చేశాడు. అనంతరం ఆమె వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేశాడు. ఇలా వీరి నిశ్చితార్థం, ప్రపోజల్ ఒకేసారి జరిగాయి. ఇక వీరు 2020 మే 31న వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం జూలై 30న మగ బిడ్డకు జన్మనిచ్చారు. అలా నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత.. 2024 జూలై మాసంలో విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కుమారుడు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా ఇద్దరం చూసుకుంటామని ప్రకటించారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sona Dey (@sona_dey_official)

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×