RCB IPL Trophy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. ఫైనల్ మ్యాచ్ కు ఒక అడుగు ముందుగానే… క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో 18 సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అలాగే పంజాబ్ కింగ్స్ రెండు జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఛాంపియన్ కాలేదు. ఈసారి ఎలాగైనా కప్ గెలుపు పొందాలని… దూసుకు వస్తున్నాయి రెండు జట్లు.
ఇదే నిజమైతే ఈసారి టైటిల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న జట్టు ప్రతిసారి విజయం సాధిస్తుంది. ఛాంపియన్గా నిలుస్తోంది. 2011 నుంచి.. 2024 వరకు చూసిన లెక్కల ప్రకారం… మొదటి స్థానంలో ఉన్న జట్టు ఐదు సార్లు ఛాంపియన్ అయింది. అలాగే రెండో స్థానంలో ఉన్న జట్టు ఎనిమిది సార్లు ఛాంపియన్ కావడం గమనార్హం.
ఇక మూడవ స్థానంలో ఉన్న జట్టు ఒకే ఒక్కసారి విజయం సాధించింది. అది కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. నాలుగో స్థానంలో ఉన్న జట్టు ఒక్క టైటిల్ కూడా ఇప్పటివరకు గెలవలేదు.
పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉన్న బెంగుళూరు
పైన పేర్కొన్న సెంటిమెంట్ ప్రకారం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. లక్నో పైన గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. 19 పాయింట్లు రెండో స్థానానికి చేరుకుని క్వాలిఫైయర్ ఇవాళ ఆడబోతోంది. సెంటిమెంట్ ప్రకారం రెండవ స్థానంలో ఉన్న జట్టు గెలిచి ఫైనల్ కి వెళ్తుంది అన్నమాట. అలాగే ఫైనల్లో కూడా విజయం సాధించి టైటిల్ గెలుస్తుంది. ఇదే విషయాన్ని పాత సెంటిమెంట్ లెక్కలు చెబుతున్నాయి. మరి గతంలో జరిగిన సెంటిమెంట్ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో భాగంగా క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. చండీగర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు ఎలాంటి వర్షం అడ్డంకి రావడం లేదు. ఈ మేరకు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ తీసుకుంటే వర్షం పడినా కూడా మ్యాచ్ గెలవచ్చని అంచనాలు వేస్తున్నాయి.
వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఎలా ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ వర్షం పడి ఈ మ్యాచ్ రద్దు అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారి… పూర్తిగా రద్దు అయితే… విజేతగా పంజాబ్ కింగ్స్ ఉంటుంది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది కాబట్టి వాళ్లను ఫైనల్ కు పంపిస్తారు. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్లి… పంజాబ్ తో ఫైట్ లో పాల్గొనాల్సి ఉంటుంది.