Rohit Sharma: ఫ్యాన్స్ అంతా తమ అభిమాన క్రికెటర్ ని ఎప్పుడెప్పుడు కలుస్తామా, ఎప్పుడు వారితో ఫోటో దిగుదామా అని ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారి అభిమాన క్రికెటర్ ఎదురుపడితే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు. కానీ అభిమానులంతా ఒకేసారి చుట్టుముట్టడంతో ఆ క్రికెటర్ కి చాలా ఇబ్బంది కలుగుతుంది. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
Also Read: IPL 2025: IPL 2025 అట్టర్ ఫ్లాఫ్… అమ్ముడుపోని టికెట్లు ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం మాల్దీవులకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం రోజు రాత్రి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు రోహిత్ శర్మ. అనంతరం తన కుమార్తె సమైరాను తీసుకొని కారులో ఎక్కించేందుకు వెళుతుండగా కొంతమంది అభిమానులు, ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. రోహిత్ శర్మతో కలిసి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
దీంతో వారి తీరుపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. తన కూతురు సమైరా ఫోటోలు తీయద్దని వారించాడు. ఆ తరువాత తన కుమార్తెను కారులో కూర్చోబెట్టి.. కొద్దిసేపటి తర్వాత కూల్ అయిన రోహిత్ శర్మ నవ్వుతూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. అయితే ఈ సందర్భంలో ఎయిర్ పోర్టులో కూడా కెప్టెన్సీ మోడ్ లోకి వెళ్లిపోయాడు రోహిత్ శర్మ. ఆయనతో ఫోటోలు దిగేందుకు వచ్చిన అభిమానులు, ఫోటోగ్రాఫర్లని మైదానంలో ఫీల్డ్ సెట్ చేసినట్లుగా అందరిని ఒక పక్కకి సెట్ చేశాడు.
అనంతరం వారితో ఫోటోలు దిగాడు. అయితే వారందరినీ ఫీల్డ్ సెట్ చేసినట్లుగా రోహిత్ శర్మ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ 18వ సీజన్ ఐపిఎల్ 2025 లో రోహిత్ శర్మ, ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియంలో తమ ఫ్యాన్స్ ముందు ప్రదర్శన ఇవ్వబోతోంది.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ.. రంగంలోకి తోపు హీరోయిన్లు?
ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జట్టు ఎలా రాణించబోతుందో వేచి చూడాలి. అలాగే రోహిత్ శర్మ తన ఆటతో మరోసారి అభిమానులను మైమరపించగలడా..? అనే ప్రశ్న అభిమానులలో ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు తన తొలి మ్యాచ్ ని ఈనెల 23న చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ రోహిత్ శర్మ టెస్ట్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. అతని టెస్ట్ ఫామ్ ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నాడు. రోహిత్ టెస్టుల్లో మరింత బాగా ఆడాలని, తన ఆలోచనలపై దృష్టి పెట్టాలని అన్నాడు. ఐపీఎల్ అనంతరం జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ రోహిత్ శర్మకు కీలకం కాబోతుందని అభిప్రాయపడ్డాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">