IPL 2025 Mohammad Kaif urges RCB to sign Rohit Sharma as a captain to end trophy drought: ఐపీఎల్ 2025 పైన ఆర్సీబీ దృష్టి పెట్టింది. ఈ తరునంలోనే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇస్తే బాగుంటుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీని కెప్టెన్ గా రోహిత్ శర్మనే తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా ఈ విషయాన్ని చెప్పాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీ రోహిత్ శర్మను సంప్రదించాలని చెప్పాడు. కెప్టెన్ గా ఒప్పందం చేసుకోవాలని సూచించాడు. హిట్ మ్యాన్ కు ఆర్సిబి పగ్గాలు అప్పగించేందుకు ఇదే మంచి సమయమని చెప్పాడు. రోహిత్ ఆడినంత కాలం తన ఆట తీరుతో కెప్టెన్ గానే ఉండాలన్నాడు.
గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా వచ్చినట్టుగానే, ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ వెళ్లిపోవాలని అంటున్నారు. ముంబై నుంచి బయటకు వస్తే రోహిత్ శర్మ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయన్నాడు. మరో రెండు మూడు ఏళ్ల వరకు కెప్టెన్ గానే రోహిత్ రాణించాలని చెప్పాడు. హిట్ మాన్ ఓ ప్రత్యేకమైన కెప్టెన్. ముంబై ఇండియన్స్ కు ఏకంగా ఐదుసార్లు టైటిల్స్ అందించిన ఘనత రోహిత్ శర్మకు మాత్రమే ఉందన్నాడు. అభిమానులు అంతా ఐసీసీ టైటిల్ కోసం ఎదురుచూసినప్పుడు వరల్డ్ కప్ ను గెలిచాడన్నారు. 17 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ కలను నెరవేర్చాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రోహిత్ శర్మ అడ్వాంటేజ్ అవుతాడని, నిజానికి ఐపీఎల్లో ఆర్సిబి అంటే చాలా ప్రత్యేకం. బ్రాండ్ వాల్యూ పరంగా టాప్ లిస్ట్ లో ఉంటుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2008 నుంచి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఫాలోవర్స్ మాత్రం విపరీతంగా పెరుగుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ కీలకమైన ఆటగాడు. 2008 నుంచి ఆర్సీబీని అన్ని తానై నడిపిస్తున్నాడు. కెప్టెన్సీ లేకపోయినప్పటికీ లీడర్ గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గైడ్ చేస్తున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాక డూప్లేసిస్ పగ్గాలు అందుకున్నాడు. గత సీజన్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ పరవాలేదనిపించాడు. ఆటగాడిగా హిట్ అయ్యాడు. కాకపోతే ఇతడి వయస్సు సమస్యగా మారుతుంది.
ప్రస్తుతం ఈ సౌతాఫ్రికా ఆటగాడి వయసు 40 సంవత్సరాలు. వచ్చే మూడు నాలుగు సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఆర్సిబి యాజమాన్యం నిర్ణయాలు తీసుకోనుంది. అందుకే డూప్లేసిస్ ను ఈసారి వేలానికి వదిలివేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకోవాలని ఆర్సిబి ఆలోచనలో ఉన్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే కోహ్లీ, రోహిత్ శర్మ కాంబినేషన్ మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఉంటే మ్యాచ్ చాలా హిట్ అవుతుంది. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారని చర్చలు జరుపుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగితే అభిమానులకు పరుగుల విందు అని అంటున్నారు.