Satyabhama Serial Today Episode September 2nd: నిన్నటి ఎపిసోడ్ లో క్రిష్, సత్య మధ్య రొమాంటిక్ సీన్స్ బుల్లితెర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మంగళవారం ఎపిసోడ్ మొత్తం వీరిద్దరితోనే ఉంటుంది. మైత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అనుకుంటుంది. మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. నా వల్ల ఇద్దరు గొడవలు పడటం నాకు ఇష్టం లేదు అంటుంది. నందినికి సారీ చెప్పిన మైత్రి నన్ను క్షమించు నాదే తప్పు నీ చేతుల మీదుగానే ఆ పెళ్లి జరగాలి. నువ్వు నా పెళ్లి చెయ్యాలి . హర్ష పెళ్లి చూపులకు రమ్మని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక బామ్మను బలవంతంగా తమ శోభనానికి ఒప్పిస్తాడు క్రిష్.. వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసిన రుద్ర కోపంతో మహాదేవయ్యను సత్యను లేపేద్దాం అని అడుగుతాడు. కుందేలు, నీ అయ్య పులి పోని ఆడుకొని అని అంటాడు. ఇక సత్య మనకు దెబ్బస్తుంది. దీన్ని ఎలాగైనా తప్పించాలి అని రుద్ర తండ్రితో అంటాడు. మహదేవయ్య రుద్రలు సత్య గురించి మాట్లాడుకుంటారు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మహదేవయ్య, రుద్ర సత్య గురించి మాట్లాడుకుంటారు. సత్య చిన్నా గాడిని తమ మీదకే పంపిస్తుందని రుద్ర మహాదేవయ్యతో అంటాడు. కుందేలు కదా అనుకుంటే అది మన నెత్తిమీదే కూర్చుంటుంది అంటాడు. బాపు దీనివల్ల మనకు ఎప్పుడైనా సమస్యే.. సత్యను చంపేద్దాం అని రుద్ర అంటాడు. దానికి కోపంతో రగిలిపోయిన మహదేవయ్య రుద్రను పిచ్చిపట్టిందా? ఇంకోసారి ఈ మాట అంటే ఊరుకొనేది లేదు అంటాడు. చిన్నా గాడు మన మాట వినేందుకు వాడి చేతిలో పెట్టిన ఐస్ క్రీమ్ సత్య.. దాన్ని చంపేయ మంటావ్ అంటాడు. ఇది కాకుంటే ఇంకో ఐస్ క్రీమ్ అని అంటాడు రుద్ర.. సత్యను ఈ ఇంటికి తీసుకురావడానికి, నందినిని కోడలు పంపించింది సింపతీ కోసం అని అంటాడు. ఎమ్మెల్యే అయ్యే వరకు నేను సత్య మీద అటాక్ చేస్తే కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తాను అంటాడు.
ఇక నందిని మైత్రి పెళ్లి చూపులు అని నందిని హడావిడి చేస్తుంది. మంచి సంబంధం అని అందరికీ చెబుతుంది. మైత్రి లైఫ్ సెటిల్ అయితే మనకే మంచిది కదా అని అందరితో సంతోషంగా అంటుంది. ఇక మైత్రి ని చూసి ఇలా రెడీ అయితే ఎవరు చూడరు నా దగ్గర మంచి చీరలు ఉన్నాయి. తీసుకొస్తాను అని వెళ్తుంది. హర్షను చూసి పెళ్లి చూపులు నీకు కాదు మైత్రికి అంటారు. మంచి సంబంధం అన్నావు మైత్రి వెళ్లిపోతే మంచిది అంటారు. ఎవరికీ నీకు అంటాడు. ఎవరొకరికి అని మైత్రిని రెడీ చేస్తుంది. ఇక రుద్ర స్మార్ట్ గా రెడీ అవ్వడం చూసి రేణుక షాక్ అవుతుంది. ఇక బామ్మ క్రిష్ జాతకం భద్రంగా పెడుతుంది. సత్య క్రిష్ పుట్టుక గురించి అడుగుతుంది.. బామ్మ క్రిష్ పుట్టినప్పడే పెద్ద రచ్చ చేశారు. అప్పుడు జరిగిన కథను విని అంతేనా జరిగింది. ఇంకేమి జరగలేదా అంటుంది. ఇక సత్య అమ్మమ్మ చెప్పిన ప్రకారం ట్విస్ట్ లేదు అని అంటుంది.. ఇక సత్యకు చక్రవర్తి కాల్ చేశాడు.
ఎందుకో క్రిష్ గుర్తుకు వచ్చాడు వాడు బాగానే ఉన్నాడుగా.. వాడిని దగ్గరుండి చూసుకోవాలి. సత్యకు క్రిష్ ను దగ్గర ఉండి చూసుకో అంటాడు.. ఇక చక్రవర్తిని ఇంటికి రమ్మని పిలుస్తుంది సత్య. నాకు క్రిష్ పుట్టుక గురించి ఏదైన తెలుస్తుందేమో అంటుంది. ఇక క్రిష్ సత్య డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కుందాం అని తెలుగు మాస్టర్ ను అడగడానికి వెళ్లి ఇరుక్కుంటాడు.. శోభనం కోసం ఇన్ని పాట్లు పడాలి అంటూ మాస్టర్ చేతిలో చివాట్లు తింటాడు. ఆయన పద్యం చెబితే వయసు చెబుతాను అంటాడు. ఆ పద్యం చెప్పలేక నానా తంటాలు పడతారు. ఇక అప్పుడే క్రిష్ కు సత్య చెప్పిన మాటలు విని అక్కడే ఉంటాడు.. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో చక్రవర్తిని సత్య ఎందుకు ఈ కుటుంబంతో కలిసి ఉండరు అని అడుగుతుంది. నాకు ఈ గొడవలు నచ్చవు అని అంటాడు.. ఇక క్రిష్ అసలు తండ్రి గురించి అడుగుతుంది. కానీ అంతలోకే మహదేవయ్య వస్తాడు.. క్రిష్ అసలు అసలు తండ్రి తెలుసుకోవడం నీ వల్ల కాదు అని సత్యతో మహదేవయ్య ఛాలెంజ్ చేస్తాడు.. ఇక సత్య నిజం తెలుసుకుంటుందో లేదో చూడాలి…