Gang Rape: వరంగల్‌లో ఫార్మసీ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత ఫ్రెండ్ మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లి ఫార్మసీ చదువుతున్న యువతిపై అత్యాచారం చేశాడు. వాడితోపాటు మరో ఇద్దరు యువకులున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనలో వరంగల్‌లో వెలుగుచూసింది.
వరంగల్ నడిబొడ్డున దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై లాడ్జిలో అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరీక్షలు మిస్సయిపోతానని భావించింది బాధిత యువతి. చివరకు పరీక్షలు తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టింది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.
భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి వరంగల్ శివారులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీకి చెందిన వసతి గృహంలో ఉంటుంది. గత నెల 15న యువతి సొంతూరుకి చెందిన యవకుడు.. యువతి దగ్గరకు వచ్చాడు.
మాట్లాడే పని ఉందంటూ కారులో ఎక్కమన్నాడు. అప్పటికే ఆ కారులో ఇద్దరు యువకులున్నారు. అమ్మాయి ససేమిరా అనడంతో బలవంతంగా యువతిని కారు ఎక్కించారు. వరంగల్ సిటీలో రైతు బజార్‌కి సమీపంలో ఉన్న లాడ్జిలో గది తీసుకున్నారు.
ALSO READ: రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్..36 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
గదికి తీసుకెళ్లిన ఆ ముగ్గురు కామాంధులు.. యువతిని నానా ఇబ్బందులు పెట్టారు. మాయ మాటలు చెప్పి యువతితో మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో కాలేజీలో పరీక్షలు ఉండడంతో తనకు జరిగిన అన్యాయంపై నోరు మెదపలేదు.
ఇంటికి వెళ్లిన తర్వాత తనకు జరిగిన విషయాన్ని తల్లితో చెప్పింది. బాధిత యువతి, ఆమె తల్లి కలిసి వరంగల్ కమిషనర్‌ను కలిసి జరిగినదంతా వివరించారు. అధికారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు.
తొలుత లాడ్జికి వెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు పోలీసులు. రూమ్ ఎవరి పేరు మీద తీసుకున్నారనే తెలుసుకుని ఆధార్ కార్డు డీటేల్స్ తీసుకున్నారు. ఆ యువకుడు భూపాలపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. బాధిత యువతి ఫ్రెండ్‌తోపాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నాడు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో ఇద్దరు యువకులు కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది.