Monsoon Forecast 2025: ఎండలు దంచి కొడుతున్నాయా? దీని ప్రభావం ఏడాది మొత్తం పడుతుందా? ఈ ఏడాది వాతావరణ ఎలా ఉంటుంది? వర్షపాతం ఏవిధంగా ఉండబోతోంది? భారత వాతావరణ శాఖ విభాగం ఎలాంటి అంచనాలను బయటపెట్టింది? మరి వర్షపాతం సాధారణంగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుందా? ఇదంతా వారం రోజుల కిందటి మాట. చల్లని కబురు చెప్పేసింది వాతావరణ శాఖ.
చల్లటి కబురు
ఎట్టకేలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశముందని అంచనాలు బయటపెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే అన్నదాతలకు శుభవార్త. ఈసారి వర్షాకాలం సీజన్‌లో ఎల్ నినో ప్రభావం ఉండదని తేల్చి చెప్పేసింది. ఈ విషయాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర ఢిల్లీలో వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈసారి దేశంలో సగటు వర్షపాతం 105 శాతంగా ఉండనుంది.
ఆ గండం గడిచింది
దేశంలో నాలుగు నెలల పాటు వర్షాకాలం ఉంటుంది. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబరు నైరుతి రుతుపవనాలు ఉండనున్నాయి. ఆ సమయంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు ప్రతి ఏడాది జూన్ ఫస్ట్ వీక్ కేరళలో ఎంటరవుతాయి. సెప్టెంబర్ నాటికి రుతుపవనాల సీజన్ ముగియనుంది. వర్షపాతం 96 నుంచి 104 శాతం నమోదు అయితే దాన్ని సాధారణంగా చెబుతారు. అది ఈ ఏడాది దాదాపు 105 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే ఎల్ నినో ప్రభావం ఉంటే వర్షాలు తక్కువ స్థాయిలో పడతాయి. ఈసారి దేశంలో అలాంటి పరిస్థితులు లేవన్నది వాతావరణ శాఖ అధికారి మాట.
తమిళనాడుపై ప్రభావం
రుతుపవనాల ప్రభావం దక్షిణాదిలో తమిళనాడు తప్పితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ స్పష్టంచేసింది. లడఖ్, తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.1971-2020 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లు.
ALSO READ: ఫీజులు పెంచితే స్కూల్ గుర్తింపు రద్దు, సీఎం వార్నింగ్
దేశంలో వ్యవసాయానికి వర్షాలే కీలకం. దాదాపు 42.3 శాతం మంది ప్రధాన జీవనాధారం. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి లో 18 శాతం వ్యవసాయ రంగం నుంచి సమకూరుతోంది. సాగు భూముల్లో దాదాపు 52 శాతం వర్షాధార ప్రాంతాల్లో ఉన్నాయి. వర్షాలు కురిస్తే రిజర్వాయర్లు కళకళలాడుతాయి. సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావచ్చన్న అంచనాలు రైతన్నలకు శుభవార్త.
వడ గాల్పులు తప్పదు
ప్రస్తుతానికి వద్డాం.. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారుల మాట. దీని ప్రభావం విద్యుత్ గ్రిడ్‌ల పని తీరుకు ఆటంకాలు కలగవచ్చు.
Monsoon 2025 Forecast:
Consistent with our expectations, the IMD forecasts a high probability of above-normal (33%), normal (30%), and excess (26%) all-India average rainfall from June to September. Together, there is only a 11% chance of below-normal or deficit rainfall and a… pic.twitter.com/tjS9WqH1gX
— 🔴All India Weather (@pkusrain) April 15, 2025