BigTV English

Prithvi Shaw In CSK: CSKను కాపాడేందుకు బులెట్ లా దూసుకొస్తున్న పృథ్వీ షా

Prithvi Shaw In CSK:  CSKను కాపాడేందుకు బులెట్ లా దూసుకొస్తున్న పృథ్వీ షా

Prithvi Shaw In CSK:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL } 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ కి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఓ పీడకలలా మారింది. సీఎస్కే పరిస్థితి ఎలా ఉందంటే.. సొంత మైదానంలో కూడా గెలవడం కష్టంగా మారింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన సీఎస్కే.. నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ టోర్నీ నుండి తప్పుకోవడం జట్టుకు మరో ఎదురు దెబ్బ. దీంతో మహేంద్ర సింగ్ ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అయితే రుతురాజు గైక్వాడ్ లేని లోటు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ లో స్పష్టంగా కనిపిస్తోంది.


ఇప్పుడు సీఎస్కే ముందున్న అతిపెద్ద టెన్షన్.. ఋతురాజు గైక్వాడ్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకురావడం. ఋతురాజు గైక్వాడ్ లా ఆడే ఆటగాడిని జట్టులోకి తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని. ఈ క్రమంలో గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన రుతురాజు గైక్వాడ్ స్థానంలో టీమిండియా ఓపెనర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ పృథ్వీ షా ని జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. దీంతో పృథ్వీ షా పేరు ఎక్స్ {ట్విట్టర్} లో ట్రెండ్ అవుతుంది. చెన్నై మేనేజ్మెంట్ కూడా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 


ఐపీఎల్ లో కొన్ని సీజన్ల పాటు ఓ వెలుగు వెలిగిన పృద్వి షా.. తొలిసారి ఈ లీగ్ కి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృద్వి షా అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. 75 లక్షల కనీస ధరతో మెగా వేలంలోకి వచ్చిన పృద్వి షా ని.. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. మరోవైపు ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు పృద్వి షా. పృద్వి షా తన ఐపీఎల్ అరంగేట్రం నుండి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ప్రతినిథ్యం వహించాడు. అయితే 2025 మెగా వేలంలో ఢిల్లీ కూడా అతడిని సొంతం చేసుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇప్పుడు పృద్వి షా కి ఋతురాజ్ గైక్వాడ్ గాయం రూపంలో మంచి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటివరకు 79 మ్యాచ్ లు ఆడిన పృద్వి షా.. 147.47 స్ట్రైక్ రేట్ తో 1,892 పరుగులు చేశాడు. ఇందులో 14 హఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక చెన్నై బ్యాటింగ్ లైనప్ లో రుతురాజ్ గైక్వాడ్ కీలక ప్లేయర్. నంబర్ 3 లో బ్యాటింగ్ ఆడుతూ జట్టు స్కోర్ నీ ముందుకు నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు అతడు లేకపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం జట్టుకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గతంలో రాహుల్ త్రిపాఠిని ఓపెనర్ గా ట్రై చేశారు. కానీ మూడు మ్యాచ్ లలో అతడు కేవలం 30 పరుగులు మాత్రమే చేయడంతో.. కాన్వేని ఓపెనింగ్ కి తీసుకువచ్చారు. కానీ రచిన్ రవీంద్ర, కాన్వే ఇద్దరూ స్లోగా ఆడే ప్లేయర్స్. పవర్ ప్లే లో వేగంగా రన్స్ సాధించే ప్లేయర్ అవసరం ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి ఉంది. ఈ నేపథ్యంలో ఈ లోటును భర్తీ చేసేందుకు పృథ్వీ షా ని తీసుకోవాలని భావిస్తుంది చెన్నై మేనేజ్మెంట్.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×