రివ్యూ : ‘ప్రవింకూడు షాపు’ మలయాళ మూవీ
నటీనటులు : బాసిల్ జోసెఫ్, షౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ తదితరులు
ఓటీటీ : సోనీ లివ్
దర్శకుడు : శ్రీరాజ్ శ్రీనివాసన్ (అరంగేట్రం)
నిర్మాత : అన్వర్ రషీద్
Pravinkoodu Shappu Review : బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రవింకూడు షాపు’ అనే మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ 2025 జనవరి 16న థియేటర్లలో విడుదలైంది. నూతన దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. మరి మలయాళ మూవీ లవర్స్, బాసిల్ జోసెఫ్ అభిమానులను ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
పది రోజుల్లోనే కేసులను సాల్వ్ చేయగల సత్తా ఉన్న పోలీస్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్న నిజాయితీపరుడైన యంగ్ పోలీస్ అధికారి సంతోష్. ఈ నేపథ్యంలోనే అతను కొంబన్ బాబు అనే కల్లు దుకాణం యజమాని మృతి కేసును టేకప్ చేస్తాడు. అనుమానితులలో ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి, ఉపాధ్యాయుడు, దొంగ, కల్లు దుకాణం కార్మికుడు… ఇలా మొత్తం 11 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో డార్క్ పాస్ట్ ఉంటుంది. అది కూడా కల్లు దుకాణం యజమానితో ముడిపడి ఉంటుంది. ఇంతకీ ఈ 11 మందిలో కల్లు దుకాణం యజమానిని చంపింది ఎవరు? ఎప్పటిలాగే ఈ పోలీస్ అధికారి 10 రోజుల్లోనే ఈ కేస్ ని సాల్వ్ చేయగలిగాడా? అనేది తెరపై చూడాల్సిన కథ.
విశ్లేషణ
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే జరిగిన హత్య ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు రంగంలోకి దిగడం, అనుమానితులను విచారించడం, తర్వాత శిక్షించడం ఇదే ప్రాసెస్ కొనసాగుతుంది. అందులో సరైన చోట ఊహించని ట్విస్ట్ లు పడితే ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఈ ఫార్ములాకి డార్క్ కామెడీ అనే అంశాన్ని జోడించి, ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని అనుకున్నాడు డైరెక్టర్. అయితే దర్శకుడు తను అనుకున్న కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో తడబడ్డాడు. ఇక 11 మంది అనుమానితులను విచారిస్తున్నప్పుడు… ప్రతి ఒక్కరి స్టోరీలోనూ కల్లు దుకాణంలో జరిగిన సన్నివేశాలు రిపీట్ కావడం అన్నది విసుగు తెప్పిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా ఒకే స్టోరీలో ఎక్కువ కథాంశాలు ఉండడం అన్నది సినిమాపై ఆసక్తిని కోల్పోయేలా చేస్తాయి. ఎందుకంటే ఇందులో సమాధానాలు కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ టైంలో కొన్నిసార్లు హీరో పాత్ర తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు ఆ హత్య వెనక ఉన్న ఉద్దేశం ఏంటి ? అనేది తెలియకపోవడం వల్ల క్లైమాక్స్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఇక హీరో బ్యాగ్రౌండ్ గురించి సరైన క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. ముఖ్యంగా ఆమె తల్లి సూసైడ్ సస్పెన్స్ గానే ఉంటుంది.
ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేస్తుంది. కావాల్సిన ట్విస్ట్ లు ఉన్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెన్స్ గా సాగినప్పటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఈ సినిమాకు ప్రధాన బలం బాసిల్ జోసెఫ్. తెలివైన పోలీస్ ఆఫీసర్ గా ఆయన తన పాత్రతో ఆకట్టుకుంటారు. అలాగే మరో ప్రముఖ నటుడు షౌబిన్ షాహిర్ ఎమోషనల్ రోల్ తో మెప్పిస్తాడు. చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు. సైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ అంటే నటీనటులు, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులని చెప్పొచ్చు. అయితే కథనం, సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం, హీరో పాత్రలో లేని క్లారిటీ వంటివి మైనస్ పాయింట్స్.
Read Also : భర్త ముందే ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో… భార్యనే రే*ప్ చేసే భర్త… ట్విస్ట్ లతో మెంటలెక్కించే తమిళ రొమాంటిక్ మూవీ
మొత్తానికి…
బ్లాక్ హ్యూమర్, మిస్టరీని మిక్స్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండడంతో మర్డర్ మిస్టరీలను ఇష్టపడేవారు ఈ వీకెండ్ ఓసారి సినిమాను చూడొచ్చు.
Pravinkoodu Shappu Rating : 1.5/5