RCB VS KKR : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ మే 08 నుంచి వాయిదా పడింది. ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఐపీఎల్ రేపటి నుంచి పున:ప్రారంభం కానుంది. మే 17న శనివారం రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ-కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మే 18 ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, అదేరోజు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మే 19, 2025 సోమవారం రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
Also Read : Sanjiv Goenka Donation: తిరుమల శ్రీవారికి LSG ఓనర్ భారీ విరాళం.. పంత్ సెంచరీ కొట్టడం పక్కా
మే 20 మంగళవారం రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, మే 21 బుధవారం రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, మే 22 గురువారం రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్, మే 23 శుక్రవారం రాత్రి 7.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. మే 24, 2025 శనివారం రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. మే 25, 2025 ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్.. అలాగే రాత్రి 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. మే 26 సోమవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, మే 27 రాత్రి 7.30 గంటలకు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ల వరకు వేదికలు ఖరారు అయ్యాయి.
ఇక అలాగే మే 29న రాత్రి 7.30 గంటలకు క్వాలిఫైర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 01, 2025 ఆదివారం రాత్రి 7.30 గంటలకు క్వాలిఫైర్ 2, జూన్ 03, 2025 మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. క్వాలిఫైర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లకు మాత్రం ఇంకా వేదికలు ఖరారు కాలేదు. ఇక రేపటి నుంచి పున:ప్రారంభమయ్యే ఐపీఎల్ లో పలు కారణాలతో కొందరూ విదేశీ ప్లేయర్లు పాల్గొనలేకపోతున్నారు. దీంతో టెన్షన్ లో కూరుకుపోయిన ఫ్రాంచైజీలు, అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వేలంలో అమ్ముడుపోని ఇతర ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాలేని విదేశీ ప్లేయర్ల స్థానంలో జట్లు కొత్తవారిని తీసుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకి విదేశీ ఆటగాళ్లు తిరిగి రాకపోవడంతో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకు అద్భుతంగా ఆడిన ఆర్సీబీ జట్టు ఈ సారి టైటిల్ గెలవాలనే కసిలో ఉంది. కానీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం.. ఐపీఎల్ మ్యాచ్ లు వాయిదా పడటంతో బెంగళూరు కి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. మరీ ఈ సీజన్ లో ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో వేచి చూడాలి.